రాఖీ పండుగ... తియ్యని వంటకాలు

అన్నా చెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని పెంచే పండుగ రక్షాబంధన్ ( రాఖీ పండుగ) . ప్రేమను పంచే ఈ పండుగ రోజున ( ఆగస్తు 19) వాళ్ల చేతికి రాఖీ కట్టి నోటిని తీసి చేస్తారు. ఇంట్లోనే సులువుగా తీపి వంటకాలను ట్రై చేయండి. 

బ్రెడ్​ జామ్​​ తయారీకి కావలసినవి

  • చక్కెర.. ఒక కప్పు
  • నీళ్లు.. ఒక కప్పు
  • ఇలాచీ పొడి.. అర టీస్పూన్​
  • నిమ్మరసం.. ఒక టీస్పూన్​
  • బ్రెడ్​ ముక్కలు.. నాలుగు
  • పాలపొడి .. రెండు టేబుల్​ స్పూన్లు
  • క్రీమ్​.. ఒక టేబుల్​ స్పూన్​
  • నెయ్యి లేదా నూనె... సరిపడా

తయారు చేయు విధానం: పాన్​ లో చక్కెర, నీళ్లు, ఇలాచీ పొడి, నిమ్మరసం వేసి పాకం పట్టాలి.  బ్రెడ్​ ముక్కలు కట్​ చేసి మిక్సీలో కచ్చాపచ్చాగా పొడి చేయాలి. ఆబ్రెడ్​ పొడిలో పాలపొడి, క్రీమ్​, పాలుపోసియ ముద్దగా కలపాలి.  ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని  చిన్న చిన్న ఉండలు చేయాలి.  వీటిని నెయ్యి లేదా నూనెలో వేయించి... చక్కెర పాకంలో వేయాలి.  రెండు గంటలు తరువాత ఈ బ్రెడ్​ జాం తింటే చాలా బాగుంటుంది. 


పన్నీర్ ఖీర్ తయారీకి కావలసిన పదార్ధాలు

  • పన్నీరు తురుము .. ఒక కప్పు
  • పాలు.. ఒక లీటర్​
  • బియ్యప్పిండి- ...ఒకటేబుల్ స్పూన్
  •  ఇలాచీపాడి... - పావుటీస్కూన్​
  • చక్కెర పొడి... పావు కప్పు
  • కుంకుమ పువ్వు.. చిటికెడు
  • డ్రై ఫ్రూట్స్​  (బాదం   పిస్తా మరియు  జీడిపప్పు) ... పావుకప్పు
  • నెయ్యి... సరిపడ

తయారీ విధానం:  గిన్నెలో పాలు పోసి మరిగించాలి. అందులో బియ్యం పిండి వేసి పదినిమిషాలు ఉడికించాలి. పాల మిశ్రమంలో డ్రై ఫ్రూట్లు, ఇలాచీ పొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి. ఐదు నిమిషాలు అయిన తరువాత చక్కెర పొడి వేసి మిశ్రమం గట్టిగా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత మంట తగ్గించి పన్నీరు తురుము వేసి కలపాలి. రెండు నిమిషాలు తరువాత  స్టవ్​ పై నుంచి దింపి పైన కుంకుమ పువ్వు చల్లి.. డ్రై ఫ్రూట్స్​ వేయాలి. 


బేసిన్ పిస్తా బర్ఫీ తయారీకి కావలసినవి

  • శెనగపిండి .. ఒక కప్పు
  • చక్కెర.... రెండు కప్పులు
  • పాలు.. ఒక కప్పు
  • నెయ్యి.. సరిపడ
  • కొబ్బరి తురుము.. ఒక కప్పు
  • పిస్తా పప్పు.. ముప్పావు కప్పు

తయారీ విధానం: స్టవ్​ పై పాన్​ పెట్టి వేడి చేయాలి. అందులో శెనగపిండి వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు సన్నని మంటపై వేయించాలి. తరువాత అందులో పాలు పోసి బాగా మిక్స్​ చేయాలి. శెనగపిండి ఉండలు కట్టకుండా కలిపి రెండు నిమిషాల తరువాత చక్కెర వేయాలి. పావుగంట తరువాత దోరగా వేయించి కొబ్బరి తురుము వేయాలి. దానిపై మూత పెట్టి ఆరు నుంచి ఏడు గంటలు పక్కన పెట్టాలి. చాకుతో నచ్చిన ఆకారాల్లో బర్ఫీలను కట్​ చేసి వాటిని నెయ్యిలో వేగించి పిస్తా పప్పుతో డెకరేట్​ చేయాలి.


క్యారెట్ హల్వా తయారీకి కావలసినవి

  • క్యారెట్ తురుము.... మూడు కప్పులు.
  • పాలు... నాలుగు కప్పులు
  • నెయ్యి ... నాలుగు టేబుల్​ స్పూన్లు
  • చక్కెర ... ఒకటిన్నర కప్పు
  • జీడిపప్పు పలుకులు.. పది
  • ఇలాచీ పొడి ...- పావు టీ స్పూన్ 
  • కుంకుమ పువ్వు.... చిటికెడు
  • కిస్మస్​... ఒక టేబుల్​ స్పూన్​

తయారీ విధానం: స్టవ్​ పై పాన్​లో పాలు, కుంకుమపువ్వు వేసి మరిగించాలి. తర్వాత క్యారెట్​ తురుము వేసి కలపాలి. సన్నని మంటపై మిశ్రమం దగ్గర పడేదాకా ఉడికించాలి. అప్పుడే క్యారెట్​ తురుములోకి పాలు ఇంకుతాయి. మిశ్రమం గట్టిపడ్డాక అందులో నెయ్యి చక్కెర, ఇలాచీపొడి వేసి సన్నని మంటపై కొద్దిసేపు పెట్టి చివరగా నెయ్యిలో వేగించిన కిస్మిస్​,  జీడిపప్పు పలుకులు వేయాలి. ఈ హల్వాను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.