దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇక జమ్మూకాశ్మీర్ లోనూ రాఖీ పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.యూరీ సెక్టార్లో సోని గ్రామస్తులు..ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టారు. ఆతర్వాత వారికి స్వీట్లు అందించారు.
ఇక మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని సముద్ర తీరంలో రక్షాబంధన్ పండ సందర్భంగా సైకత శిల్పాన్ని రూపొందించాడు. పరమశివుని సైకత శిల్పాన్ని తయారు చేసి.. రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
మరో వైపు దేశప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఈ పవిత్రమైన పండగ అందరి బాంధవ్యాలలో కొత్త మాధుర్యాన్ని, ఆనందం శ్రేయస్సును ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రక్షాభందన్ సందర్భంగా రాజస్థాన్ సీఎం నివాసంలో.. భజన్ లాల్ శర్మకి రాఖీ కట్టారు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబ సభ్యులు. ఆ తర్వాత వారికి కానుకలు అందించారు సీఎం .
#WATCH | On the festival of 'Raksha Bandhan', locals tie 'Rakhi' and offer sweets to Army personnel in Soni village along LoC in the Uri sector of Jammu & Kashmir pic.twitter.com/FH6MO8Lj2E
— ANI (@ANI) August 19, 2024