గురుకులాలను ఆఫీసర్లు తరచూ విజిట్ చేయాలి : సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: గురుకుల స్కూళ్లు, కాలేజీలను తహసీల్దార్లు, ఎంపీడీవోలు తరచూ సందర్శించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు, ఏకలవ్య మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలన్నారు. గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యాలయాల్లో మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చూడాలన్నారు.

 సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకు 15 రోజుల్లో హెల్త్ చెక్ అప్ నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలన్నారు. హాస్టళ్లలో కనీస సదుపాయాల కల్పన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో  డీఈవో జగన్మోహన్ రెడ్డి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ రాధాబాయి, మండల ప్రత్యేక అధికారులు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీవోలు, ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.