రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్ కు రూ. 25 లక్షలు విరాళం

​వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి సికింద్రాబాద్ కు చెందిన గల్లా గుండయ్య, కుటుంబసభ్యులు గురువారం రూ. 25 లక్షలు, కోడెల సంరక్షణ కేంద్రం, గోశాలకు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆలయ ఏఈవో ప్రతాప నవీన్ , ప్రొటోకాల్ పర్యవేక్షకుడు సిరిగిరి శ్రీరాములకు చెక్కులు అందజేశారు. తదనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు  నిర్వహించారు.