నోటికి అందితేనే వాహనం ముందుకు.. రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్న గజరాజు

ఏనుగేంటి..? రోడ్ ట్యాక్స్ వసూలు చేయడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..! మీరు వింటోంది నిజమే. శ్రీలంకకు చెందిన ఓ 40 ఏళ్ల ఏనుగు బుట్టల-కటరగామ రహదారిపై టోల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. రోడ్డుపై ఇరు వైపులా వచ్చే వాహనాలను అడ్డగించడం.. వారు అందించే ఆహారాన్ని ఆరగించడం దాని పని. 

తొలి రోజుల్లో ఏనుగు దారి తప్పి రోడ్డుపై ఆగిందేమో అనుకున్నారు. కొన్నాళ్ళకు ఏనుగు ఆహారం రూపంలో రోడ్ ట్యాక్స్ వసూలు చేయడమే పనిగా మార్చుకుంది. బుట్టాల-కటరగామ మార్గం శ్రీలంకలోని పశ్చిమ, ఆగ్నేయ తీరాల మధ్య కీలక రహదారి. ఈ మార్గం గుండా రోజూ 500కి పైగా వాహనాలు వెళ్తుంటాయి. వీటిలో ఓ వంద వదిలేసినా.. మరో నాలుగు వందల వాహనాల డ్రైవర్లు ఏదో ఒక ఆహారాన్ని ఏనుగుకు ముట్ట చెప్పాల్సిందేనట. 

అలా అని ఏనుగు వాహన దారులను భయపెట్టడం లేదు. ఎంతో శాంతంగా తొండాన్ని ముందుకు చాపి జాలిగా అభ్యర్థిస్తోంది. దాని ఆకలిని అర్థం చేసుకుంటున్న డ్రైవర్లు, ప్రయాణీకులు నోటికి ఏదో ఒకటి అందిస్తున్నారు. ఈ ఏనుగు దెబ్బకు లనుగమువెహెర నుండి సెల్లా కటారగమ వెళ్లే దారిలో రోడ్డు వెంబడి 100 కి పైగా ఫ్రూట్స్ స్టాల్స్  పుట్టుకొచ్చాయంటే.. ఈ ఏనుగు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BBC Earth (@bbcearth)