చత్తీస్‌ఘడ్ డాక్టర్ల వరల్డ్ రికార్డ్.. లేజర్‌ ట్రీట్‌మెంట్‌తో హార్ట్ బ్లాక్ క్లియర్

రాయ్‌పూర్‌లోని భీమ్ రావ్ అంబేడ్కర్ ప్రభుత్వం హాస్పిటల్ లోని HOD డాక్టర్ స్మిత్ శ్రీవాస్తవ నేతృత్వంలోని గొప్ప విజయాన్ని సాధించారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం రక్తనాళాల్లో ఏర్పడే బ్లాక్స్ ను లేజర్ ట్రీట్‌మెంట్‌తో తొలగించారు. 66ఏళ్ల రోగి ఎడమ మూత్రపిండ ధమనిలో 100, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో 90 శాతం బ్లాక్స్ ను లేజర్ చికిత్స ద్వారా సర్జరీ చేసి తొలగించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రి అయిన రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో డాక్టర్లు, అడ్వాన్స్ కార్డియాక్ ఇన్‌స్టిట్యూట్‌లోని డాక్టర్లతో కలిసి ఈ ఆపరేషన్ ను పూర్తి చేశారు. 

రోగి 2023లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్టెంట్‌ చేయించారు. అది పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల తీవ్రమైన గుండె సమస్యలు, రక్తపోటు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పేషెంట్ ఎదుర్కొన్నారని  స్మిత్ శ్రీవాస్తవ తెలిపారు. లేజర్ యాంజియోప్లాస్టీ ద్వారా మూత్రపిండాల ధమనుల్లో ఏర్పడే బ్లాక్స్ కు దీర్ఘకాలికంగా పరిష్కరం చేశామని, ప్రపంచంలోనే ఇలా చేయడం ఫస్ట్ టైం అని డాక్టర్లు పేర్కొన్నారు.