Good Health: వర్షాకాలం.. బత్తాయితో బోలెడు లాభాలు..

అసలే వర్షాకాలం.. అందులోనూ.. వారం రోజుల నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో అధికశాతం వాగులు.. వంకలు పొంగుతున్నాయి.  దీంతో దోమల విజృంభణ పెరిగింది.  ఇక వాటంతట అవే వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది.  దీంతో జనాలు బెంబేలెత్తుతున్నారు.  అయితే   వర్షాకాలంలో అనేక వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే శరీరానికి రోగనిరోధక శక్తి అవసరం. ఈ సీజన్‌లో వచ్చే బత్తాయి తింటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

 వర్షాకాలంలో బత్తాయిలను తింటే జలుబు చేస్తుందనే అపోహను ప్రక్కన పెట్టి.. తరచుగా బత్తాయి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బత్తాయి పండును కాకుండా జ్యూస్ చేసుకుని కూడా త్రాగవచ్చు. దీని వల్ల శరీరానికి కలిగే లాభాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బత్తాయిలో విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, ఫోలేట్‌తో పాటు పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. బత్తాయి సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్ కాబట్టి బత్తాయి జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.వివిధ అవయవాల పని తీరు మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే కాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే డిటాక్సీక్ ఏజెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది.

ALSO READ | కొబ్బరితో కోరినన్ని లాభాలు..కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి...

బత్తాయిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మలబద్ధకాన్ని ఇది దూరం చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా కండరాలు పట్టేయడం తిమ్మిర్ల బారిన పడకుండా ఉండడానికి బత్తాయి జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. క్రీడాకారుడు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఫంగల్ లక్షణాలు బత్తాయి జ్యూస్ లో ఉండటం వల్ల కళ్ళను అంటువ్యాధుల నుంచి ఇది కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కంటిలో శుక్లాలు పెరగకుండా ఉంటాయని అంటున్నారు.బత్తాయి జ్యూస్ లోని పోషకాలు నీరసం, అలసటను రాకుండా చేస్తారు. అంతే కాకుండా తక్షణ శక్తిని శరీరానికి అందిస్తాయి. ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.దీనిలో ఉండే విటమిన్లు ,మినరల్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలను తగ్గిస్తాయి. అంతే కాకుండా కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం సాగకుండా దోహదపడతాయి.

చాలా మంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్యలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే తరుచుగా బత్తాయి జ్యూస్ తీసుకోవాలి. ఇది వెంట్రుకలు చివర్లు చిట్లిపోకుండా జుట్టు మెరిసేలా చేస్తుంది.