Good Health: వర్షాకాలం.. రోగాల కాలం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

వర్షాకాలం సీజన్​ దాదాపు మొదలైంది.  ఇప్పటి వరకు ఎండలతో ఇబ్బంది పడితే.. ఇప్పుడు ఆఫీసులకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లేవారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ వర్షంతో తడుస్తామో.. ఎలాంటి రోగాలు వస్తాయో.. అని జనాలు బిక్కుబిక్కుమనే కాలం... వర్షాకాలం.  వాటి బారిన పడకుండా ఉండాలంటే... కచ్చితంగా కొన్నింటికి దూరంగా ఉండాలి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. . 

రోజురోజుకీ వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం... మధ్యాహ్నం... ఎండలు దంచికొడుతున్నా.. సాయంత్రం అయ్యేసరికి వర్షం కురుస్తోంది. అవును మరి, మృగశిర కార్తె దగ్గర పడుతోంది. కదా. అప్పటివరకూ ఉన్న ఎండలు మెల్లిమెల్లిగా మాయమవుతుంటాయి. ఎండలు తగ్గుతున్నాయని సంబరపడేలోపే ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. 

  •  మామూలు రోజులకంటే ఈ కాలంలో అధికంగా నీళ్లు తాగాలి. అదీ మరిగించి చల్లార్చిన నీళ్లనే తీసుకోవాలి.
  •  బయటికి వెళ్లినప్పుడు మరచిపోకుండా గొడుగు, రెయిన్కోట్ తీసుకెళ్లాలి.
  •  వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి.
  • రాత్రిళ్లు నిద్ర పోయేటప్పుడు పొడుగు చేతులు ఉన్న షర్ట్, ఫుల్ ప్యాంట్, కాళ్లకు సాక్స్ వేసుకోవాలి.
  •  శరీరానికి మస్కిటో రెపెల్లెంట్ రాసుకోవాలి.
  •  బయటి నుంచి తీసుకొచ్చిన పండ్లు, కూరగాయలను పచ్చిగా తినకూడదు. వాటిని వేడి నీళ్లతో శుభ్రం చేసి వండుకునేతినాలి.
  • బయటకు వెళ్లేటప్పుడు రెయిన్​ కోట్​ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. 
  • సాధ్యమైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండండి. 
  • వర్షంలో తడిచి ఇంటికి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయాలి.
  • ఈ కాలంలో దాహం వేసిన ప్రతిసారీ గోరువెచ్చని నీళ్లు లేదా హెర్బల్ టీ తాగాలి. అంతేగానీ కూల్ డ్రింక్స్​ జోలికి పోవద్దు.
  •  తడిచిన జుట్టు, తడి బట్టలతో ఏసీ ఉన్న గదిలోకి వెళ్లొద్దు.
  • నీళ్లలో తడిచిన ప్రతిసారీ లేదా కాళ్లు కడుక్కున్నప్పుడు వెంటనే తుడుచుకోవాలి.
  •  నీళ్లు నిల్వ ఉండే సంపులు, డ్రమ్ముల దగ్గరికి పిల్లలను వెళ్లనివ్వకూడదు.
  • రోడ్ల మీద అమ్మే పదార్థాలు తీసుకోకుండా, ఇంట్లోనే తాజాగా వండుకున్న ఆహారాన్నే తీసుకోవాలి.
  • మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. లేదంటే అవి రోగనిరోధకశక్తిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
  •  భోజనం తీసుకునే ముందు, కాలకృత్యాలకు వెళ్లొచ్చాక... చేతులను హ్యాండ్వాష్ శుభ్రం చేసుకోవాలి.