రెయిన్​ శ్నాక్స్​.. ఆలూ బోండా తిన్నారంటే.. 

వర్షాకాలంలో ..  కప్పు చాయ్ ..  నోరూరించే ఆలూ స్నాక్స్‌ .. వేడి వేడిగా ఆలూ బొండా  తింటుంటే.. నా సామిరంగా.. ఆ హాయిని చెప్పలేం.. అనుభవించి తీరాల్సిందే.  కరకరలాడే పకోరాల నుండి స్పైసీ చాట్స్ .. ఆలూబోండా రుచికి చాలా అద్భుతంగా ఉంటాయి.  ఈ రెసిపీ వంటకాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 

ఆలూ బోండా తయారీకి కావాల్సినవి

  • అలుగడ్డలు.. ఉడికించినవి - మూడు
  •  పచ్చిమిర్చి తరుగు... - ఒక టీ స్పూన్ 
  • ఉల్లిపాయ తరుగు - ... ఒక టేబుల్ స్పూన్
  •  అల్లం తరుగు - ...ఒక టీ స్పూన్
  •  శెనగపిండి-... ఒక కప్పు 
  • వాము- ఒక టీ స్పూన్...
  •  ఉప్పు-...  తగినంత 
  • కారం-... తగినంత 
  • అల్లం ,వెల్లుల్లి పేస్ట్ -... ఒక టీ స్పూన్ 
  • చాట్ మసాలా-... అర టీ స్పూన్ 
  • జీలకర్ర పొడి ...- అర టీ స్పూన్
  •  నూనె - ...డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం: శెనగపిండి, ఉప్పూ, కారం, వాము అల్లంవెల్లుల్లి పేస్టేను ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి పిండిలా కలపాలి. ఉడికించిన అలుగడ్డలు మెదిపి ఒక గి న్నెలోకి తీయాలి. అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు, తరిగిన అల్లం ,, ఛాట్​  మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్ర మాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేగించాలి.