పానీపూరీ వావ్ రెయిన్ బో పానీ పూరీ వావ్.. వావ్.. వావ్..!

కలర్స్ చూస్తే వావ్ అని, కలర్ ఫుల్ ఫుడ్ చూస్తే వావ్.. వావ్ అని అనాల్సిందే. అయితే ఈరోజుల్లో  స్ట్రీట్ ఫుడ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాయంత్రం అలా బయటకు వెళ్లి ఏదో  ఒకటి స్నాక్స్ తినకపోతే ఆరోజు అసంతృప్తిగానే  ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ ని స్ట్రీట్ ఫుడ్ గురించి అడిగితే నోటి నుంచి ఒకటే మాట వస్తుంది అదే పానీపూరీ. ఇండియా మొత్తంగానే ఇది చాలా ఫేమస్. నార్త్ ఇండియాన్ ఫుడ్ అయిన పానీపూరీకి కొంతమంది తయారీదారులు రంగులు అద్దుతున్నారు. గుజరాత్ లోని అహ్మద్ నగర్ వీధుల్లో ఓ లేడి రెయిన్ బో పానీపూరీ ఇంటర్నేట్ ను షేక్ చేస్తుంది. కలర్ ఫుల్ గా కనిపించే ఈ రెయిన్ బో పానీపూరీ చూస్తే నోరూరాల్సిందే మరి. 


రెడ్, వైలెట్, ఎల్లో వంటి రంగుల్లో కనిపించే ఈ పూరీలకు కలర్స్ తీసుకొచ్చేందుకు బీట్ రూట్, బ్లాక్ బెర్రీస్, పసుపు వాడానని వీటినే తయారు చేసిన ఆమె అంటుంది. ఇంద్రదనుస్సు కలర్స్ ఉండే పానీపూరీ తినాలంటే ప్రతి శని, ఆదివారాలు సాయంత్రం 4, 8గంటల మధ్య అహ్మద్ నగర్  న్యూరాణిప్, సర్థార్ చౌక్ లకు వెళ్లాలి.  రెయిన్ బో పానీపూరీ బండి పెడుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ కలర్ ఫుల్ పానీపూరీ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.