అంగారక గ్రహంపై అద్భుతమైన రెయిన్ బో..ఫొటోలు రిలీజ్ చేసిన ESA

మార్క్ గ్రహానికి సంబంధించిన  కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.చలి, డస్ట్, ఎడారి లాంటి ఈ గ్రహంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, జపాన్ వంటి దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ అరుణ గ్రహంపై పరిశోధనలు జరుపుతున్నాయి. రెడ్ ప్లానెట్ గా పిలువబడే మార్స్ గ్రహంపై అనేక ఆసక్తికరమైన విషయాలను శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) విడుదల చేసిన ఫొటోలు కొన్ని అంగారక గ్రహంపై ఇంధ్ర ధనస్సును చూపిస్తున్నాయి. 

అంగారక గ్రహ ఉపరితలానికి సంబంధించిన  అద్భుతమైన విజువల్స్ తో మార్స్ మోర్ ద జస్ట్ రెడ్డ అనే క్యాప్షన్ తో ESA ఫొటోలను విడుదల చేసింది. ESA ఎక్సో మార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ నుంచి సేకరించిన ఫొటోలను అప్ చేసింది. ఈ ఫొటోల్లో పసుపు రంగు మట్టి పొరలు, తెలుపు, నీలం రంగు పొరలుకనిపిస్తున్నాయి. పసుపు రంగు మట్టి పొరల్లో ఇనుము, మెగ్నీషియం ఉంటుంది. తెలుపు, నీలం రంగు పొరల్లో అల్యూమినియం నిక్షేపాలు, ముదురు ఎరోడెడ్ రాళ్లను చూపుతుంది. దీంతోపాటు అంగారక గ్రహంపై అద్భుతమైన ఇంద్రధనస్సును కూడా అంతరిక్ష కెమెరాలు చూపించాయని ESA   తెలిపింది. 

అంగారకుడిపై ఇంద్రధనస్సుకు సంబంధించిన మరిన్ని విషయాలను అంతరిక్ష సంస్థ అందించింది. ఒకప్పుడు నీటితో నిండిన ఖనిజాల నిధి. ఇది మా ఎక్సోమార్స్ రోసలిండ్ ప్రాంక్లిన్ రోవర్ కి ల్యాండింగ్ సైట్ అని ESA తెలిపింది. 

సౌర వ్యవస్థలో భూమి మినహా అత్యంత క్షుణ్ణంగా అన్వేషించబడిన గ్రహాలలో మార్స్ ఒకటి. ESA ప్రకారం.. ఈ గ్రహంపై  కాలానుగుణంగా  రంగు మార్పులు.. పెరుగుతున్న వృక్షసంపదకు సంకేతాలు అని అంతరిక్ష సంస్థ అంటోంది. మొక్కలు ఉంటే అన్ని రకాల ఇతర జీవులు అక్కడ ఉండవచ్చని  అంటోంది. అయితే  ఎర్ర గ్రహంపై మానవులకు అనుకూలమైన జీవితం ఉందా లేదా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు నిర్ధారించలేకపోయారు.

మార్స్ భూమికి 60 మిలియన్ కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది.  లోతైన లోయలు, భారీ అగ్నిపర్వతాలు , మంచు క్రిస్టల్ మేఘాలతో అందమైన ప్రపంచం ఉన్నట్లు నలభై సంవత్సరాలు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అంటున్నారు.