డిసెంబర్ నెలలో ఉదయాలు కాస్త స్పెషల్ అనే చెప్పాలి. మంచు తెరలను దాటుకుని వచ్చే సూర్యకిరణాల ములివెచ్చటి పలకరింపులు కలిగించే అనుభూతిని చెప్పాలంటే కొన్నిసార్లు మాటలు రావు. అంతమంచి ఫీల్ కలుగుతుంది. అయితే ఆ కిరణాలు మనుషుల్నే కాదు పక్షులనూ పలకరించాయి.
పక్షుల రెక్కల మీదకి చేరి హరివిల్లుగా మారాయి. సరిగ్గా అదేటైంలో.... జర్మన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ పుసిక్ పీటర్స్ విహంగాల రెక్కల హరివిల్లును తన కెమెరా క్లిక్తో బంధించాడు.