ఎండాకాలంలో ముసురు వాన

నిజామాబాద్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు వానతో వాతావరణం చల్లబడింది.  నగర శివారులోని  మోపాల్ , బోర్గం గ్రామాల్లోని పంట పొలాలు గాలివానకు  నేలకొరిగాయి. అనుకోకుండా కురిసిన వర్షంతో రోడ్డుపై ఆరబోసిన  ధాన్యం తడిసిపోయింది.