భువనగిరిలో రూ.4 కోట్ల గంజాయి దహనం

యాదాద్రి, వెలుగు :  రైల్వే స్టేషన్లలో పట్టుబడిన గంజాయిని రైల్వే పోలీసులు 'అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం' రోజున బుధవారం భువనగిరిలో దహనం చేశారు. దహనం చేసిన గంజాయి విలువ రూ. 4 కోట్ల వరకు ఉంటుంది.  డ్రగ్స్​ డిస్పోజల్​కమిటీ చైర్మన్​, రైల్వే ఎస్సీ చందనా దీప్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొందరు స్మగ్లర్లు గంజాయిని రోడ్డు మార్గంలో వెహికల్స్​బదులు రైలు మార్గంలో రవాణా చేస్తున్నారు.

Also read :   ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మించాలి : పైడి రాకేశ్​రెడ్డి

ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్​ వెళ్లే రైళ్ల ద్వారా గంజాయిని రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ప్రత్ర్యేక దృష్టి సారించారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమ ఆధీనంలో ఉన్న గంజాయిని యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలోని రోమా కంపెనీకి తరలించారు. అక్కడే గంజాయిని తూకం వేసి కంపెనీలోని బ్రాయిలర్​లో వేసి దహనం చేశారు.