- ఉపాధి రంగాన్ని నాశనం చేశారు..ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
- ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్
- హర్యానా ఎన్నికల ర్యాలీలో ప్రసంగం
చండీగఢ్: ఇండియాలో నిరుద్యోగానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణమని..దేశఉపాధి వ్యవస్థను ప్లాన్డ్గా ఆయన ధ్వంసం చేశారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం దేశంలో కులగణనను చేపట్టాలని కాంగ్రెస్ కోరుతున్నదని.. బీజేపీ మాత్రం వ్యతిరేకిస్తున్నదని విమర్శించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తుపాను రానున్నదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
గురువారం హర్యానాలోని అస్సంద్లో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడారు. బీజేపీ పాలనలో హర్యానా నాశనమైందని, యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల ప్రయోజనాలు కల్పిస్తున్న మోదీ సర్కార్ రైతుల రుణాలను మాఫీ చేయడంలేదని, వారికి భరోసా కల్పించే కనీస మద్దతు ధర చట్టం తేవడం లేదని విమర్శించారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంత మంది ఉన్నారు.. అగ్రవర్ణాల్లో పేదలు ఎందరు ఉన్నారోనని తెలుసుకోవాలని కాంగ్రెస్ కోరుతున్నదని తెలిపారు. కేవలం 15 శాతం జనాభా ఉన్న వర్గాలకు చెం దిన వ్యక్తులు మాత్రమే కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. అందుకే కులగణన చేపట్టి ఎవరి వాటా వారికి దక్కాలంటున్నామని.. బీజేపీ, మోదీ మాత్రం దీన్ని వ్యతిరేకి స్తున్నారని విమర్శించారు.