రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక

కోటగిరి, వెలుగు:- రాష్ట్ర స్థాయి స్కూల్​ గేమ్స్​ ఫెడరేషన్​ అండర్-17 ఖో-ఖో పోటీలకు కోటగిరిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ రాహుల్ ఎంపికైనట్లు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ఖలీక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ స్కూల్ విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు. 

15,-17 తేదీల్లో వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలు జరుగుతాయన్నారు.  రాహుల్​ను ఉపాధ్యాయులు అభినందించారు.  కార్యక్రమంలో పీఈటీ సాయి కుమార్, డిప్యూటీ వార్డెన్ ఆయాస్ పాల్గొన్నారు.