ర్యాగింగ్ ఓ రాక్షస క్రీడ

నాగరిక సమాజంలోని  మనిషి  బుర్రలో  ఎక్కడో  దాగి ఉన్న  పైశాచిక బుద్ధి అనుకూల పరిస్థితులలో బయటకు వచ్చి బుసలు కొడుతోంది.  ఎదుటివారి నిస్సహాయక పరిస్థితే ఇవతలి వాడికి అనుకూల పరిస్థితి.  విద్యార్థుల స్థాయిలో కొంతమందిలో ఇది ర్యాగింగ్ రూపంలో బయటపడుతుంది. ర్యాగింగ్ ఓ పైశాచిక క్రీడ.  సూక్ష్మంగా చెప్పాలంటే ర్యాగింగ్ అనేది ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి దానిని చూసి ఆనందపడే ఒక పాశవిక చర్య.  ఈ ర్యాగింగ్ ఎన్నో ఏండ్ల  క్రితమే బ్యాన్ అయినా.. ర్యాగింగ్ భూతం మ‌‌‌‌‌‌‌‌‌‌ళ్లీ కోర‌‌‌‌లు చాస్తోంది.సీనియ‌‌‌‌ర్‌‌‌‌, వివ‌‌‌‌క్ష ఇలా అనేక రూపాల్లో  త‌‌‌‌న ఉనికిని చాటుకుంటోంది. విద్యార్థుల‌‌‌‌ను బ‌‌‌‌లి తీసుకుంటుంది. కార‌‌‌‌ణ‌‌‌‌మేదైనా కోటి ఆశ‌‌‌‌ల‌‌‌‌తో క‌‌‌‌ళాశాల‌‌‌‌ల్లోకి అడుగు పెట్టిన పిల్ల‌‌‌‌ల‌‌‌‌కు ర్యాగింగ్ తీర‌‌‌‌ని సమస్యగా మారింది.  వారి త‌‌‌‌ల్లిదండ్రుల‌‌‌‌కు తీర‌‌‌‌ని విషాదాన్ని మిగుల్చుతోంది.

ర్యా గింగ్‌‌‌‌ ఒక‌‌‌‌ప్పుడు పాఠ‌‌‌‌శాల‌‌‌‌, క‌‌‌‌ళాశాల అనే బేధం లేకుండా ప్రతి విద్యాల‌‌‌‌యంలో ఉండేది.  దీనికి ఎంతోమంది విద్యార్థులు బ‌‌‌‌ల‌‌‌‌య్యారు. అందుకే దీన్ని నిరోధించ‌‌‌‌డానికి ప్రత్యేకంగా  చ‌‌‌‌ట్టాలు సైతం తీసుకొచ్చారు.  కొన్ని రోజుల  త‌‌‌‌ర్వాత  ఫ‌‌‌‌లితాలు క‌‌‌‌నిపించాయి. అంతా సక్రమంగా ఉంది అనుకున్న త‌‌‌‌రుణంలో.. వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహ‌‌‌‌త్యాయ‌‌‌‌త్నంతో  ఈ భూతం మ‌‌‌‌ళ్లీ తెర‌‌‌‌మీద‌‌‌‌కు వ‌‌‌‌చ్చింది.  ర్యాగింగ్ కార‌‌‌‌ణంగా ఇటీవ‌‌‌‌ల ఇద్దరు  మ‌‌‌‌ర‌‌‌‌ణించారు.  వ‌‌‌‌రంగ‌‌‌‌ల్​లో  వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతి అనే అమ్మాయి.  త‌‌‌‌న‌‌‌‌ను సీనియ‌‌‌‌ర్ వేధింపుల‌‌‌‌కు గురి చేస్తున్నాడ‌‌‌‌ని, ఆత్మహత్యకు య‌‌‌‌త్నించి మ‌‌‌‌ర‌‌‌‌ణంతో పోరాడి, చివ‌‌‌‌రికి క‌‌‌‌న్ను మూసింది.

ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ చదువుతున్న ద‌‌‌‌ర్శన్​ సోలంకి అనే విద్యార్థి సైతం ఆత్మహత్యకు పాల్ప
డ్డాడు.  సీనియ‌‌‌‌ర్లు వేధింపులకు గురి చేస్తున్నార‌‌‌‌ని తాను చ‌‌‌‌నిపోయే కొన్ని రోజుల ముందు త‌‌‌‌న కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ ఘటన మరువకముందే   ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ స్టూడెంట్‌‌‌‌కు గుండు కొట్టించాడు.  ర్యాంగింగ్‌‌‌‌ను నిర్మూలించాల్సిన అధ్యాపకులే విద్యార్థిపట్ల దారుణంగా ప్రవర్తించటంపై విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యం అది.   ర్యాగింగ్ అనగా కళాశాలల్లో  సీనియర్  విద్యార్థులు కొత్తగా వచ్చిన  విద్యార్థులకు  మనస్తాపం  కలిగించే రీతిలో ప్రవర్తించడం. మన దేశంలోని  ఉన్నత  విద్యావ్యవస్థలో  ర్యాగింగ్ అనేది కలవరపెట్టే వాస్తవం.  దీని వలన అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. 

విద్యార్థుల భవిష్యత్​ నాశనం

వేలాది మంది తెలివైన విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతున్నాయి. లోతుగా చూస్తే ఇది జూనియర్లపై వివక్షత చూపడమే.  ఒక్కోసారి ఈ వేదనను  భరించలేక, తగు సమయంలో పరిష్కరించేవారు లేక, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ ర్యాగింగ్లో లైంగిక వేధింపులు, స్వలింగ సంపర్క దాడులు, బట్టలు విప్పడం, బలవంతంగా అశ్లీల చర్యలు, సంజ్ఞలు, శారీరక హాని లేదా ఆరోగ్యానికి లేదా వ్యక్తికి ఏదైనా ఇతర ప్రమాదం కలిగించే చర్యలు ఉంటాయి.  

ఈ ర్యాగింగుకు నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌‌‌‌ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎంబీబీఎస్. విద్యార్థి  ఆత్మహత్య  కలకలం రేపింది.  రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన వరంగల్ కాకతీయ  మెడికల్ కళాశాల (కేఎంసీ) పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసుతో పాటు నిన్న నల్లగొండ మెడికల్ కాలేజీ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడంతో ఐదుగురు విద్యార్థులు సస్పెండ్​కి గురయ్యారు. కాగా,  తమిళనాడు ప్రభుత్వం ర్యాగింగ్‌‌‌‌ను నేరంగా పేర్కొంటూ ర్యాగింగ్ నిరోధక ఆర్డినెన్స్‌‌‌‌ను ఆమోదించింది. తరువాత ఈ ఆర్డినెన్స్ తమిళనాడు ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997గా అధికారికంగా రూపొందింది. తద్వారా  విద్యాసంస్థల్లో  ర్యాగింగ్‌‌‌‌ను నిషేధించి,  నేరంగా  పరిగణించిన రాష్ట్రంగా తమిళనాడు  భారతదేశంలో  మొదటి స్థానంలో  నిలిచింది.

ర్యాగింగ్‌‌‌‌పై పోరాటం

ర్యాగింగ్‌‌‌‌ను  సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థుల భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వాలి.  ర్యాగింగ్‌‌‌‌ను అరికట్టేందుకు విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలను జారీ చేయాలని విశ్వ జాగృతి మిషన్ దాఖలు చేసిన పిల్‌‌‌‌పై  సుప్రీంకోర్టు 1999లో యూజీసీని నివేదిక కోరింది. దీంతో  ఢిల్లీలోని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేపీఎస్ ఉన్ని ఆధ్వర్యంలో ర్యాగింగ్‌‌‌‌పై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు యూజీసీ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  

ఉన్ని కమిటీ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్‌‌‌‌పై చట్టాలు తీసుకురావాలని సూచించింది.  ర్యాగింగ్‌‌‌‌కు వ్యతిరేకంగా సున్నితత్వం కోసం చేపట్టాల్సిన పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది.  ర్యాగింగ్‌‌‌‌ను అరికట్టడంలో విఫలమైన సంస్థలను అడ్మిషన్లకు దూరంగా ఉంచాలని కూడా సూచించింది. విద్యార్థుల అడ్మిషన్ రద్దు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే వరకు శిక్షలు విధించాలని ఈ కమిటీ సూచించింది. తీవ్రతను బట్టి మూడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చని తెలిపింది.

 2006లో  సుప్రీంకోర్టు ర్యాగింగ్‌‌‌‌ను నిరోధించడానికి మార్గాలు,  పద్ధతులను సూచించడానికి సీబీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్ కె రాఘవన్ ఆధ్వర్యంలో మరొక  కమిటీని ఏర్పాటు చేసింది.  కమిటీ పలు కీలక పరిశీలనలు చేసింది. ర్యాగింగ్‌‌‌‌కు మానసిక,  సామాజిక, రాజకీయ,  ఆర్థిక,  సాంస్కృతిక సహా అనేక అంశాలు కారణాలుగా ఉన్నాయని, ఇది ఉన్నత విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.  ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమాన్యం, ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.

ర్యాగింగ్​పై  కఠిన చర్యలు 

యూజీసీ ఉన్నత విద్యా సంస్థలలో ర్యాగింగ్ ముప్పును అరికట్టడంపై నిబంధనలు 2009 పేరున తీసుకువచ్చింది. దీని ప్రకారం ర్యాగింగ్​కి పాల్పడినవారికి సస్పెన్షన్లు విధించవచ్చు. స్కాలర్‌‌‌‌షిప్, ఫెలోషిప్​లు నిలిపివేయొచ్చు. పరీక్షలకు హాజరుకాకుండా డీబార్, పరీక్షల ఫలితాలు నిలుపుదల, హాస్టల్ నుంచి బహిష్కరణ, అడ్మిషన్లు రద్దు వంటివి చేయొచ్చు. ఇంకా ఏదైనా ఇతర సంస్థలో ప్రవేశం నుంచి డీబార్ చేయొచ్చని యూజీసీ తెలిపింది. వీటిని ఉన్నత విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 

 ఒక విద్యార్థికి ర్యాగింగ్ ద్వారా అవమానం చేసి, అతన్ని బాధించడం జరిగితే  ర్యాగింగ్​కు పాల్పడినవారికి 6 నెలల వరకు జైలు శిక్ష  1000 రూపాయల వరకు జరిమానా విధింపబడుతుంది. ర్యాగింగ్ సందర్భంలో మరణించటం జరిగిన లేదా ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే.. నేరస్తునికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలుశిక్ష,  50,000 రూపాయల వరకు జరిమానా విధింపబడతాయి.  ర్యాగింగ్ బాధితులకు సహాయం చేయడానికి 12 భాషలలో యాంటీ ర్యాగింగ్ టోల్-ఫ్రీ ‘హెల్ప్‌‌‌‌లైన్’ని కూడా యూజీసీ ఏర్పాటు చేసింది. ఇంకా యాంటీ ర్యాగింగ్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను అభివృద్ధి చేసింది. ఇందులో ఫిర్యాదులు చేయొచ్చు. పరిష్కార స్థితిని రియల్ టైంలో  తెలుసుకోవచ్చు. 

- వెంకటేశ్,
పీడీఎస్ యూ, 
తెలంగాణ రాష్ట్ర నేత