Food News:  ఇవి తింటే  పిల్లలకు ..ఇమ్యూనిటి పవర్​ తో పాటు కండలు పెరుగుతాయి..

రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులను పిండిలా చేసుకుని.. చపాతీలు, జావ చేసుకుంటారు. రాగులతో చాలా ఆరోగ్యం. కొత్త కొత్త వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా తీసుకునేందుకు రాగి వడలను తయారు చేయండి. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

నిమిషాల వ్యవధిలోనే అదిరిపోయే రాగివడలు.. పిండి రుబ్బుకునే పని లేకుండా తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్ ను పిల్లలకు సాయంత్రం వేళ పెడితే.. ఒక్కటి కూడా మిగల్చకుండా లాగించేస్తారు. పైకి క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే రాగి వడలు హెల్త్ కు కూడా మంచిది. రాగి వడలు చేసుకునేందుకు పిండి రుబ్బి పెట్టుకోవాల్సిన పనిలేదు. కేవలం రాగిపిండి, పెరుగు, బొంబాయిరవ్వ ఉంటే చాలు. ఇది పిల్లలకు ఎంతో బలవంతమైన ఫుడ్​.. ఇమ్యూనిటి పవర్​ పెరుగుతుంది.  

రాగి వడలు తయారీకి కావలసిన పదార్థాలు

రాగిపిండి – 1.1/2 కప్పు
బొంబాయి రవ్వ – 1 కప్పు
ఉప్పు – రుచికి కావలసినంత
తరిగిన ఉల్లిపాయ – 1
సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3
పెరుగు – 1.1/2 కప్పు
కరివేపాకు – 1 రెమ్మ
తరిగిన కొత్తిమీర – కొద్దిగా

రాగివడలు తయారీ విధానం :  బొంబాయిరవ్వను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి రాగిపిండి, పొడి చేసుకున్న బొంబాయిరవ్వ, ఉప్పు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. పిండిని వడలకు  కలిపి పెట్టుకోవాలి.

ఇప్పుడు కళాయిని స్టవ్ పై పెట్టి.. డీప్ ఫ్రై కి కావలసినంత ఆయిల్ వేసుకుని.. వడలను ఆయిల్ వేసి వేయించుకోవాలి. అంతే.. వేడి వేడి రాగి వడలు రెడీ. వీటిని కొబ్బరి పల్లీ చట్నీ లేదా టొమాటో చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు.. మీరు కూడా ఒకసారి రాగి వడలను ట్రై చేయండి.