నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు సస్పెండ్

నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు విద్యార్థులను కాలేజ్ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. కాగా, మెడికల్ కాలేజీలో చదువుతోన్న అభినవ్, మనీదీప్, బాలరాజ్, శరత్, నరేష్ తమను ర్యాగింగ్ చేస్తున్నారని కొందరు విద్యార్థులు ప్రిన్సిపాల్‎కు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థుల కంప్లైంట్ మేరకు ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపాల్ విచారణ జరిపారు.

ALSO READ | వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్లు

 అభినవ్, మనీదీప్, బాలరాజ్, శరత్, నరేష్  జూనియర్లపై ర్యాగింగ్‎కు పాల్పడ్డట్లు తేలడంతో ఐదుగురిని ప్రిన్సిపల్ కాలేజీ నుండి సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ కారణంగా ఐదుగురు విద్యార్థులపై సస్పెండ్ వేటు పడటంతో నల్లగొండ మెడికల్ కాలేజీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.