ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నా?... ఎక్కువగా చూస్తున్నా? ప్రమాదం తప్పదు. ముఖ్యంగా పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఫోన్ పై చేరే క్రిములు, దుమ్ము వల్ల రోగాలు వస్తాయి. అంతేకాదు.. ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వాళ్లకు రేడియేషన్ ప్రభావం తప్పకుండా ఉంటుందని డాక్టరు హెచ్చరిస్తున్నారు. రేడియేషన్ వల్ల శరీరం ముడతలు పడటం, దద్దుర్లు రావడం.. లాంటివి జరుగుతాయి. కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. మెడ కింద, గడ్డం కింద ముడతలు వస్తాయి.
ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే బ్యాటరీ తక్కువగా ఉన్న టైమ్ సమయంలో ఫోన్ లో మాట్లాడకూడదు. అత్యవసరం అయితేనే మాట్లాడాలి. చార్జింగ్ పెట్టిన సమయంలో చార్జింగ్ తీసి మాట్లాడటం మంచిది. చిన్న చిన్న విషయాలను మెసేజ్ రూపంలో చెప్పడం మంచిది. ఫోన్ మాట్లాడేటప్పుడు ఎడమ చెవి వైపు పెట్టుకోవాలి. హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తే చాలా వరకు మంచిది. లేదా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడొచ్చు. ఫోన్ వేడెక్కేంతగా మాట్లాడకూడదు. పేలిపోయే ప్రమాదం ఉంది. నిద్రిస్తున్న సమయంలో ఫోన్ దూరంగా ఉంచాలి. చిన్నారులకు ఫోన్లు ఇవ్వకపోవడం మంచిది.