కోడిపుంజు ఆకారంలో హోటల్..దాని ఎత్తు 114 అడుగులు

ఈ ఫొటోలో బిల్డింగ్​ పైన కోడిపుంజు లేదు. కోడిపుంజులోనే బిల్టింగ్​ ఉంది. ఫిలిప్పీన్స్ దేశంలోని కాంప్యూస్టొహన్​ అనే ఊరిలో ఒక పేద్ద.. కోడిపుంజు(చికెన్) ఆకారంలో హోటల్ కట్టారు. దాని ఎత్తు 114 అడుగుల 7 అంగుళాలు. వెడల్పు 39 అడుగుల 9 అంగుళాలు. పొడవు 92 అడుగుల 5 అంగుళాలు. ఇందులో15 లగ్జరీ రూమ్​లు ఉన్నాయి. జూన్ 10, 2023లో దీన్ని కట్టడం మొదలుపెట్టారు.  456 రోజుల్లో పూర్తి చేశారు. ఈ చికెన్ హోటల్ సెప్టెంబర్ 8న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది