నిద్ర రాకపోవడం అనేది ప్రస్తుతం అందరికీ సాధారణ సమస్యగా మారిపోయింది. రాత్రి సమయంలో ఎంత ట్రై చేసినా కొంతమందికి నిద్రపట్టదు. నిద్ర లేకపోవడం వల్ల క్రమ క్రమంగా ఏకాగ్రత లోపిస్తుంది. దానితో పాటు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య ఎక్కువ రోజులు అలానే కొనసాగితే చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కాబట్టి నిద్ర త్వరగా రావడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తిన్న వెంటనే వద్దు..
హాయిగా నిద్ర పోవాలంటే.. ప్రతిరోజు తిన్న వెంటనే నిద్రపోకండి. మంచిగా నిద్ర రావాలంటే.. రాత్రి భోజనం నిద్ర పోయే 2 గంటల ముందు తినాలి. అయితే తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా వాంతులు వస్తాయి. అందుకే ఎప్పుడైనా భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు.
ఆల్కహాల్ తీసుకోవద్దు..
కొంతమంది నిద్రపట్టడం లేదని.. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల అన్ని మరిచిపోయి.. మంచి నిద్ర వస్తుందని భావిస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల సమస్య తగ్గదు. ఇంకా ఎక్కువ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బాదం పాలు..
రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే పడుకునే ముందు బాదం పాలు తాగాలి. ఎందుకంటే ఇందులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే, బాదం పాలు తాగితే మంచిది.
చెర్రీ రసం..
నిద్రలేమితో బాధపడుతుంటే.. చెర్రీస్‌ని ప్రతిరోజు మీ డైట్‌లో కలిపి తీసుకోవాలి. ఎందుకంటే చెర్రీస్‌లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. ఇది హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్ర పోవడానికి ఒక గంట ముందు, చెర్రీ రసం తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
పసుపు పాలు..
నిద్ర రాకపోతే పడుకునే ముందు పసుపు పాలు తాగవచ్చు. ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాక నిద్ర కూడా బాగా వస్తుంది. నిద్రపోయే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది.
ధ్యానం..
నిద్ర పోవడానికి ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తొలగించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో అది సహాయపడుతుంది. ఇది మెలటోనిన్, సెరోటోనిన్‌లను పెంచుతుంది. రక్తపోటు, హృదయ స్పందనను కూడా తగ్గిస్తుంది.
ఫోన్ వద్దు..
అయితే మంచి నిద్ర కోసం మీ గదిలో ఉన్న ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసివేయాలి. దీంతో హాయిగా పోవచ్చు. హాయిగా నిద్ర పోయే ముందు 10 సార్లు శ్వాస తీసుకుని వదిలివేయండి. ఇలా కనీసం 5 సార్లు చేయండి. మీ దృష్టిని.. మీ శ్వాసపై ఉంచండి. ఆ సమయంలో మీ మనసులో మరేదైనా ఆలోచన వస్తే.. మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి.
త్వరగా పడుకోవాలి..
నిద్ర బాగా రావాలంటే రాత్రి పూట త్వరగా పడుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయతే మనం త్వరగా పడుకున్నప్పుడు, మన శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. దీంతో మళ్లీ మన శరీరంలో తిరిగి శక్తి పొందడానికి తగినంత సమయం లభిస్తుంది. దీంతో మెరుగైన మానసిక స్థితి, పెరిగిన ఉత్పాదకత సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నిద్ర పొందడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దూరం కావచ్చు.
పుస్తకాలు చదవాలి..
నిద్ర త్వరగా రావాలంటే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. కాబట్టి పుస్తకాన్ని చదవడం అలవర్చుకోవాలి. దీనివల్ల ఏకాగ్రత పెరిగి మంచిగా నిద్ర పడుతుంది.
క్రైమ్ వద్దు..
అయితే ఈ రోజుల్లో చాలా మంది సాయంత్రం, రాత్రి సమయంలో క్రైమ్ న్యూస్, క్రైమ్ స్టోరీస్ లాంటివి చూస్తుంటారు. దీనివల్ల ఆ సీన్స్ అన్ని మళ్లీ నిద్రలో గుర్తొచ్చి మెలకువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాట్టి అలాంటివి చేయొద్దు. అలాంటి వాటికి బదులు రాత్రి పూట పడుకునే ముందు మనసుకి ఉల్లాసాన్నిచ్చే కామెడీ సీన్స్ లాంటివి చూడటం మంచిది.
ALS0 READ:కామారెడ్డిలో కేసీఆర్పై పోటీకి సిద్ధం