సమష్టి కృషితో దేశానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం

  • ఆర్ఈడీ కేదార్ రంజన్ పాండు 
  • రామగుండం ఎన్టీపీసీలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

జ్యోతినగర్, వెలుగు: సమష్టి కృషితో రామ గుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. దేశానికి నాణ్యమైన విద్యుత్ ను అందిస్తుందని సదరన్ రీజియన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్ఈడీ ) కేదార్ రంజన్ పాండు అన్నారు. గురువారం  ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఎగురవేసి, కేకు కట్ చేసి విషెస్  చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని కీలక విద్యుత్ సంస్థల్లో ఎన్టీపీసీ అతి పెద్దసంస్థగా నిలిచిందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి, సమాజ అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు.1978 నవంబర్ 14న ఆనాటి దేశ ప్రధాని మురార్జీ దేశాయి ఎన్టీపీసీ రామగుండం ప్లాంట్ ను ఏర్పాటు చేశారని  గుర్తుచేశారు. ఎన్టీపీసీ లో 2600 మెగావాట్లు, రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్ట్ 1600 మెగావాట్లు, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్,10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఎన్టీపీసీ రామగుండం తయారు చేస్తుందని తెలిపారు. 

ఐఎస్‌వో 14001 సర్టిఫికెట్ కూడా పొందిందని చెప్పారు.  కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ద్వారా ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో ని ప్రభుత్వ స్కూళ్లకు  గదులు నిర్మిస్తూ, స్టూడెంట్స్ కు డిజిటల్ విద్యను అందించడం ద్వారా 78,781 మందికి ప్రయోజనం పొందారని చెప్పారు. హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంకులు, మొబైల్ హెల్త్ క్యాంపుల ద్వారా105 గ్రామాల్లో 1,55,500 మందికి పైగా వైద్య సదుపాయాలు పొందారని పేర్కొన్నారు. ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బొగ్గును మండించడం ద్వారా వెలువడిన బూడిదను100 శాతం వినియోగిస్తున్నామని వివరించారు. 

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తు పది లక్షల కు పైగా మొక్కలు నాటమన్నారు. ఎన్టీపీసీకి సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ, క్లీన్ ఎనర్జీ మినిస్టీరీయల్ ఇన్ సైట్ – 2024 వంటి  ప్రతిష్టాత్మక ఆవార్డులు వచ్చాయన్నారు. గ్రామీణ క్రీడలు, నిరుద్యోగులకు ఉపాధి కార్యక్రమాలు చేపట్టి  అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి ఎన్ బీసీ మెంబర్ బాబర్ సలీం పాష, సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగులు,యూనియన్ నేతలు 
పాల్గొన్నారు.