Pushpa 2 Release: టెన్షన్లో పుష్ప టీమ్.. Nov 27 నాటికి తొలికాపీ పూర్తయితేగానీ సెన్సార్‌కు.. లేదంటే అంతే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆడియన్స్ కూడా మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ సంబంధించిన పనులను మూవీ టీమ్ వేగంగా చేస్తోంది.

అయితే ఇప్పుడు మూవీ టీమ్కి కొంత టెన్షన్ పట్టుకుంది. వారి టెన్షన్ చూస్తుంటే మూవీ రిలీజ్ అవుతుందా? కాదా? అనే అనుమానం వస్తోందట. ఈ టెన్షన్ కు కారణం మూవీ డైరెక్టర్ సుకుమార్. రిలీజ్కి ఇంకా 10 రోజులే టైమ్ ఉంది. నిన్ననే ఈ మూవీ షూటింగ్ పూర్తయిందట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు సుకుమార్.

అయితే ఎల్లుండి వరకు ఫస్ట్ కాపీ పూర్తయితేకానీ.. సెన్సార్ బోర్డుకు పుష్ప 2 మూవీని పంపలేరని మేకర్స్ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. 6 భాషల్లో మూవీ రిలీజ్ అవుతున్నందున ఆ భాషలన్నింటి కాపీలను సిద్ధం చేసి సెన్సార్కి పంపాలి. కానీ సుకుమార్ ఇంకా ఫైనల్ కాపీ రెడీ చేయలేదట. దీంతో డైరెక్టర్ సుకుమార్ తీరుతో మేకర్స్ ఆందోళన చెందుతు న్నారని టాక్. ఏమవుతుందో చూడాలి.