Kissik Song: పుష్ప 2 శ్రీలీల 'కిసిక్’ సాంగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) టాలీవుడ్ నుంచి నేషనల్ బ్యూటీగా మారే తరుణం వచ్చేస్తోంది. ఇండియా మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప: 2 ది రూల్ (Pushpa2TheRule)స్పెషల్ సాంగ్ లో శ్రీలీల తన డ్యాన్స్ నెంబర్తో ఇచ్చేపడేయబోతోంది. అల్లు అర్జున్, శ్రీలీల 'కిస్సిక్' (Kissik) సాంగ్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ స్పెషల్ సాంగ్‌కి సంబంధించిన లిరికల్ సాంగ్‌ని నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. రానున్న ఈ రెండ్రోజుల్లో కిస్సిక్ సాంగ్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ డ్యాన్స్ స్పీడ్, శ్రీలీల పెర్ఫార్మెన్స్పై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలీల టాలీవుడ్ నుంచి నేషనల్ బ్యూటీగా మారే ఛాన్స్ లేకపోలేదు అంటూ సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read:-పుష్ప గాడి ప్రభంజనానికి రంగం సిద్ధం..

ఇదిలా ఉండగా ఈ పాట కోసం శ్రీలీల రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. అయితే పుష్పలోని 'ఉ .. అంటావా' పాటకోసం సమంత దాదాపుగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన సమంతతో పోలిస్తే శ్రీలీలకి 3 కోట్లు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.