కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘనంగా జగన్నాథుడి రథయాత్ర

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో జగన్నాథుడి రథయాత్ర సోమవారం వైభవంగా నిర్వహించారు. ఇస్కాన్ మందిరం, జగన్నాథ రథయాత్ర కమిటీ, ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రకు విశేష స్పందన వచ్చింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వందలాదిమంది భక్తులు రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు.

రాంనగర్ రామ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా  చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దారి పొడవునా భజనలు, కోలాటాలు, వేషధారణ, నృత్యాలు, ఒగ్గు డోలు వంటి  కళా ప్రదర్శనలతో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో యాత్ర కొనసాగింది.

- ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌