Pune Helicopter Crash: హైదరాబాద్ వస్తున్నహెలికాప్టర్ పూణెలో కూలింది.. కెప్టెన్కు తీవ్రగాయాలు

పూణెలో హెలికాప్టర్ కుప్పకూలింది. శనివారం (ఆగస్టు 24, 2024)  బలమైన గాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా AW 139 అనే చాపర్ పౌడ్ ప్రాంతంలో కూలిపోయింది. ముంబైలోని జుహు నుండి బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్తుండగా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో కెప్టెన్‌తో సహా మొత్తం నలుగురు ఉన్నారు. ఈ  ఘటనలో కెప్టెన్ ఆనంద్ కు గాయాలయ్యాయి. 

మిగతా ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనస్థలానికి చేరుకున్న పూణె రూరల్ పోలీస్ ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ | నేపాల్​ ​నదిలో పడ్డ బస్సు..27 మంది ఇండియన్స్​ మృతి