మేడిపల్లి ఓసీపీలో పంప్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ హైడ్రో ప్లాంట్​ 

  •     టాటా కన్సల్టింగ్​సంస్థతో  సింగరేణి చర్చలు

గోదావరిఖని, వెలుగు : రామగుండం రీజియన్​ పరిధిలో మూసివేసిన మేడిపల్లి ఓసీపీలో పంప్డ్​ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రిక్​ విద్యుత్​ ప్లాంట్​ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖనిలోని ఆర్జీ–1 జీఎం ఆఫీస్​లో జీఎం శ్రీనివాస్​ అధ్యక్షతన టాటా కన్సల్టింగ్​ఇంజినీరింగ్​ లిమిటెడ్​ సంస్థ ఆఫీసర్లతో సింగరేణి కార్పొరేట్​, వివిధ విభాగాల ఆఫీసర్లు చర్చలు జరిపారు.

మేడిపల్లి ఓపెన్​ కాస్ట్​ ప్రస్తుతం మూతపడగా, అందులోకి పక్కనే ఉన్న గోదావరి నీటిని మళ్లించి హైడ్రో కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టాటా కన్సల్టింగ్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులను కోరారు. అనంతరం మేడిపల్లి ఓసీపీని సందర్శించి పరిశీలించారు.