భారతదేశంలో బ్యాన్ అయిన టాప్ యాప్‌లు ఇవే

చేతి స్మార్ట్ ఫోన్ ఉండాలి కానీ, అందులో లేని యాప్ అంటూ ఉండదు. రోజువారీ వినియోగంలో అక్కరకొచ్చేది ఐదారు యాప్‌లైనా 50 నుంచి 100 యాప్‌ల దాకా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. వీటి వల్ల ఉపయోగం ఉండదని సదరు స్మార్ట్ ఫోన్ వినియోగదారుడికి తెలుసు.. కాకపోతే ఏ రోజైనా అక్కరకు రాకపోతుందా అని డౌన్‌లోడ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. మీ మొబైల్ మీ చేతిలోనే ఉన్నా.. మీ డేటా మాత్రం మరొకరి చేతిలో ఉన్నట్లే. మీరు ఇన్‌స్టాల్ యాప్‌లో మీ డేటా నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి ప్రమాదకరమైన యాప్‌లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధం విధిస్తూ ఉంటుంది. 

భారత పౌరుల డేటాను తస్కరిస్తూ భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు, భారతదేశ రక్షణకు, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయన్న నివేదికల ఆధారణంగా గడిచిన మూడేళ్ల కాలంలో కేంద్ర ఐటీ శాఖ దాదాపు 300కు పైగా యాప్‌లపై నిషేధం విధించింది. అలా నిషేధం ఎదుర్కొన్న వాటిలో బాగా పాపులర్ అయినవి కొన్ని ఉన్నాయి. అవి ఏవనేది తెలుసుకుందాం.. 

టిక్ టాక్(TikTok)

బహుశా ఈ పేరంటూ తెలియని వారుండరు. రీల్స్ రూపంలో వీడియోలు ప్లే అవ్వడం ఈ యాప్ ప్రత్యేకత. ఔత్సహికులు తమలో ఉన్న నైపుణ్యాన్ని(టాలెంట్) బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఈ యాప్‌ను బాగా వినియోగించేవారు. "ఇదిగోండి ఫ్రెండ్స్.. నేను బ్రష్ చేస్తున్నా.. ఇప్పుడే లేచాను.." అని కూడా పోస్ట్ లు పెట్టేవారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న దుర్గారావ్(టిక్ టాక్ దుర్గారావ్) ఈ యాప్ ద్వారా ఫేమస్ అయినవారే.

PUBG

గేమింగ్ ప్రియులకు ఈ యాప్ గురించి బాగా తెలుసు. ఈ యాప్‌కు అట్ట్రాక్ట్ అయినవారికి రాత్రి, పగలు అంటూ తేడాలుండవు.. అదే ప్రపంచం అన్నట్లు బ్రతుకుతుంటారు. అలాంటి దృశ్యాలు మీ ఇళ్లలోనూ చూసే ఉంటారు. చైనీస్ టెక్ దిగ్గజం క్రాఫ్టన్ రూపొందించిన PUBG యాప్‌ను 2020లో భారతదేశంలో నిషేధించారు. తిరిగి చైనీస్ దిగ్గజం జూన్ 2021లో భారతదేశంలో BGMIని పరిచయం చేసింది. డేటా చట్టానికి అనుగుణంగా ఉండేలా గేమ్‌ను రూపొందించింది.

నిషేధం పడిన అటువంటి మరికొన్ని యాప్‌లు

  • యూసీ బ్రోజర్(UC Browser)
  • షేర్ ఇట్(SHAREit)
  • క్లీన్ మాస్టర్
  • వి మేట్(Vmate)
  • విచాట్(WeChat)
  • విమీట్(WeMeet)
  • క్యామ్ స్కానర్(Cam Scanner)
  • కిట్టి లైవ్ - లైవ్ స్ట్రీమింగ్ & వీడియో లైవ్ చాట్
  • HD Camera Selfie Beauty Camera
  • Baidu
  • Likee
  • YouCam Makeup
  • Clash of Kings
  • Helo
  • Free Fire(నిషేధించబడిన ఏడాదిన్నర తర్వాత గారెనా ఫ్రీ ఫైర్‌ను తిరిగి భారతదేశంలో పునఃప్రారంభించారు)