శాతవాహన యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పీఎఫ్ ఎగవేత

  • గత వీసీ హయాంలో ఫిర్యాదులు అందినా పట్టించుకోలే..
  • వడ్డీతో సహా చెల్లించాలని తాజాగా వర్సిటీకి పీఎఫ్ కమిషనర్ షోకాజ్ 
  • 146 మంది తాత్కాలిక ఉద్యోగులకు ఊరట

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రావిడెంట్ ఫండ్ జమ కావడం లేదు. ఉద్యోగికి హక్కుగా రావాల్సిన పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వర్సిటీ అధికారులు చెల్లించడం లేదు. గత వీసీ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో నాన్ టీచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీతాల్లోంచి ఆర్నెళ్లపాటు పీఎఫ్ వాటాను కట్ చేసినప్పటికీ.. ఆ డబ్బును జమ చేయలేదు. పీఎఫ్ చెల్లించాలని అప్పట్లో బాధిత స్టాఫ్ అనేకసార్లు దరఖాస్తులు సమర్పించినా అప్పటి వీసీ బేఖాతర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ క్రమంలో వర్సిటీలో పీఎఫ్ జమ అవుతున్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత మంది ఉన్నారంటూ శాతవాహన యూనివర్సిటీ ప్రొటెక్షన్ అండ్ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధి ఒకరు సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చట్ట ప్రకారం పని చేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ జమ చేయాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ  యూనివర్సిటీకి తాజాగా పీఎఫ్ కరీంనగర్ రీజినల్ కమిషనర్ షోకాజ్ నోటీసు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

ఆర్నెళ్లు కట్ చేసినా.. జమ చేయలే 

ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఎవరికైనా పీఎఫ్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగి వాటాతోపాటు యాజమాన్యం వాటా కూడా జమచేయాలి. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూలో మాత్రం నాన్ టీచింగ్ స్టాఫ్ కు పీఎఫ్ చెల్లించడం లేదు. ఈ క్రమంలోనే నిరుడు కొంతమంది స్టాఫ్ ఈ విషయమై అడగగా.. అప్పటి ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్ పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జమచేస్తామని చెప్పి ఆర్నెళ్ల పాటు ఉద్యోగుల శాలరీల నుంచి వారి వాటాను కట్ చేశారు. కానీ ఆ డబ్బును అప్పటి అధికారులు తమ దగ్గరే ఉంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ తతంగం సాగింది. 

మిత్తితో సహా చెల్లించండి.. 

యూనివర్సిటీ ఉద్యోగుల పీఎఫ్ వివరాలు కావాలని యూనివర్సిటీ ప్రొటెక్షన్ అండ్ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధులు ఆర్టీఐ ద్వారా పీఎఫ్ ఆఫీసులో ఈ ఏడాది ఫిబ్రవరి 29న సమాచారం కోరగా.. యూనివర్సిటీలో కేవలం 12 మందికే పీఎఫ్ ఖాతాలు ఉన్నట్లు సంబంధిత ఆఫీసర్లు సమాచారమిచ్చారు. యూనివర్సిటీలో 146 మంది వరకు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే.. కేవలం 12 మందికే పీఎఫ్ కట్ కావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫోరం ప్రతినిధులు పీఎఫ్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 

సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ఎన్ రోల్ మెంట్ చేయకపోవడం చట్టరీత్యా నేరమని, ఉద్యోగి వాటాతోపాటు యజమాని వాటాను కలిపి జమ చేయడం ఈపీఎఫ్ స్కీమ్ - 1952 చట్టం ప్రకారం సంస్థ యజమాని లేదా కాంట్రాక్టర్ బాధ్యత అని షోకాజ్ నోటీసులో కమిషనర్ గుర్తు చేశారు. అలాగే ఉద్యోగి పేరును రోల్స్ లో నమోదు చేయకపోవడం, పీఎఫ్ చెల్లించకపోవడం శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ ను వెంటనే మిత్తితో సహా చెల్లించి, రిసిప్ట్/చలానాల కాపీలను తమకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఇన్నాళ్లు పీఎఫ్​ చెల్లించకపోవడానికి గల కారణాలతో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

15 మందికిపైగా అక్రమ నియామకం..

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టొద్దని 2021 సెప్టెంబర్ 24న ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నోటిఫికేషన్లు లేకుండా సైన్స్ కాలేజీ, ప్రిన్సిపాల్ ఆఫీస్, అడ్మినిస్ట్రేషన్, హాస్టల్ తదితర విభాగాల్లో  సుమారు 15 మందికిపైగా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక జీవో నంబర్ 1222 తీసుకొచ్చి అక్రమ నియామకాలకు తెరలేపారని దుమారం రేగడంతో.. ఈ విషయమై తమకు క్లారిటీ ఇవ్వాలని ఏకంగా వర్సిటీ ఈసీ సభ్యులు అప్పట్లో రిజిస్ట్రార్ కు లేఖ రాశారు.

దీంతో అక్రమ నియామకాలను సక్రమం చేసుకునేందుకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎంపికకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ కు ముందు, తర్వాత ఉద్యోగుల రిజిస్టర్లు, సాలరీ స్లిప్ లను చెక్ చేయాలని, అక్రమ నియమకాల నిగ్గు తేల్చాలని, బాధ్యులను శిక్షించాలని శాతవాహన యూనివర్సిటీ ప్రొటెక్షన్ అండ్ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధి కోట శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు.