విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ పి.శ్రీవాణి అధికారులకు సూచించారు. సూర్యాపేటలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్  రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ను ఆమె ఆకస్మికంగా  తనిఖీ చేశారు.

కాలేజీలో సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నార అని ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్థలకు స్వచ్చమైన భోజనం అందించాలని,  పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆహార పదార్థాలను రుచి చూసి కాలేజీ ప్రిన్సిపాల్ కు పలు సూచనలు చేశారు.