డబుల్​బెడ్రూం ఇండ్ల రిపేర్లకు ఫండ్స్ ఇవ్వండి : ధన్​పాల్

  •     మంత్రి జూపల్లికి అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ వినతి

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్​ బైపాస్​ రోడ్​, నాగారంలో నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇండ్లను గత బీఆర్​ఎస్​సర్కారు సకాలంలో అర్హులకు కేటాయించపోవడంతో పనికి రాకుండా మారాయని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు.  శుక్రవారం ఆయన జిల్లా ఇన్ చార్జి  మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్​లో కలిశారు.  

సిటీలో రెండు చోట్ల నిర్మించిన ఇండ్లలో వసతుల కల్పనకు రూ. 3.25 కోట్ల ఫండ్స్​అవసరమని తెలిపారు.  జీజీహెచ్​హాస్పిటల్‌‌‌‌లో డాక్టర్ల కొరత తీర్చాలని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డెవలప్​మెంట్​వర్క్స్​చేపట్టడానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. మంత్రి పాజిటివ్​గా స్పందించారని ఎమ్మెల్యే ధన్​పాల్​ తెలిపారు.