పాత పద్దతిలోనే హెల్పర్లకు ప్రమోషన్​ ఇవ్వాలి

  • కలెక్టరేట్ ముందు  అంగన్​వాడీల ధర్నా  

నల్గొండ అర్బన్, వెలుగు: అంగన్​వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలోనే  ప్రమోషన్లు ఇవ్వాలని  తెలంగాణ అంగన్​వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి కోరారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఐసీడీఎస్ లలో 9వేల అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగానే భర్తీ చేస్తామని ఇటీవల  స్త్రీ శిశు సంక్షేమ శాఖ  ప్రకటించిందని వారు చెప్పారు. 

అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్ కల్పిచేందుకు ఇదివరకు ఎస్​ఎస్​సీ అర్హత కాగా ప్రస్తుతం  ఇంటర్​కు మార్చారని, దీనివల్ల చాలాకాలంగా పని చేస్తున్నవారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని  ఉపసంహరిచుకోవాలని, ఎస్సెస్సీ ఉన్న వారికి  ప్రమోషన్ ఇవ్వాలని,  ప్రమోషన్ పొందేందుకు  50 ఏండ్ల వరకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ALSO READ : ఇంజనీరింగ్​​ కాలేజీని పరిశీలించిన ఎమ్మెల్యే మురళీనాయక్

ఏపీ,  కర్నాటక తదితర రాష్ట్రాలలో ఎస్ఎస్​సీ అర్హతతోనే  ప్రమోషన్ ఇస్తున్నారన్నారు.   ప్రభుత్వం   సానుకూల నిర్ణయం తీసుకోకపోతే  రాష్ట్రవ్యాప్తంగా  ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దండెంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, అంగన్వాడీ నేతలు పాల్గొన్నారు.