సింగరేణిలో 2,349 మందికి ప్రమోషన్​

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కొత్తగా ఉద్యోగాల్లో చేరి ఏడాదిలో అండర్​ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 190 మస్టర్లు, సర్ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 240 మస్టర్లు పూర్తి చేసిన 2,349 మంది బదిలీ వర్కర్లకు జనరల్​ మజ్దూర్లుగా ప్రమోషన్​ కల్పిస్తూ మేనేజ్​మెంట్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆగస్టు 31 నాటికి నిర్ధిష్ట రోజులలో పనిచేసిన వారిని గుర్తించి ఈ ప్రమోషన్​ కల్పించగా, దీనిని సెప్టెంబర్​ 1వ తేది నుంచి వర్తింపచేస్తున్నారు. 

ప్రమోషన్​ పొందిన వారిలో శ్రీరాంపూర్​ ఏరియాలో 662 మంది, ఆర్జీ 1 (గోదావరిఖని)లో 552 మంది, భూపాలపల్లిలో 467 మంది, మందమర్రిలో 310 మంది, అడ్రియాల్​ ప్రాజెక్ట్​ ఏరియాలో 218 మంది, ఆర్జీ 2 ఏరియాలో 50 మంది, కొత్తగూడెం కార్పొరేట్​లో 25 మంది, మణుగూరులో 19 మంది, కొత్తగూడెంలో 16 మంది, ఆర్జీ 3 ఏరియాలో 12 మంది, బెల్లంపల్లిలో 9 మంది, ఇల్లందులో 9 మంది ఉన్నారు.