కొత్త వీసీకి సవాళ్లెన్నో.. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన శాతావాహన వర్సిటీ

  • అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఇద్దరు, ముగ్గురు టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే
  • ప్రొఫెసర్ల కొరతతో రీసెర్చ్ అంతంతమాత్రమే 
  • రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చిన గత వీసీ

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ కొత్త వీసీగా నియమితులైన ప్రొఫెసర్ ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు, బిల్డింగ్స్, నిధుల  కొరత వర్సిటీని చాలా ఏళ్లుగా వేధిస్తున్నాయి. పేరుకు యూనివర్సిటీ అయినా నిర్వహణ లోపం కారణంగా డిగ్రీ కాలేజీ స్థాయికి పడిపోయిందనే  విమర్శలు ఉన్నాయి. 

అయితే గతంలో ఈ వర్సిటీ రిజిస్ట్రార్ గా  పనిచేసిన అనుభవం ఉన్న ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీసీగా రావడంతో పాలన గాడినపడుతుందని ఉద్యోగులు, విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఆయన రిజిస్ట్రార్ గా పనిచేసిన కొద్ది సమయంలోనే వర్సిటీ చరిత్రలో తొలిసారిగా కాన్వొకేషన్ నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. 

టీచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరత 

యూనివర్సిటీలో 14 డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉన్నాయి. ఇందులో బాటనీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంటే సగం కోర్సులను విద్యార్థులు భారీగా ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిందేనన్న మాట. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కావడంతో ఈ కోర్సులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి టీచింగ్ పోస్టులు కూడా శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. గతంలో  బాటనీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్.. రెగ్యులర్ కోర్సులుగా ఉండేవి. కానీ 12బీ గుర్తింపు వచ్చాక వీటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చారు.

 పీజీ విద్యార్థులకు చదువు చెప్పేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కో డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు అసోసియేట్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఎకనామిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇద్దరే ఉన్నారు. మరో ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. బాటనీలో ఇద్దరు, మ్యాథ్స్ లో ఇద్దరు, తెలుగులో ఇద్దరు, ఇంగ్లీష్ లో ముగ్గురు టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. కనీసం కాంట్రాక్ట్, పార్ట్ టైం పద్ధతిలో కూడా ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోకపోవడంతో బోధన కుంటుపడి విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. 

యూనివర్సిటీకి ప్రొఫెసర్ పోస్టులు 10 మంజూరు కాగా.. ఇందులో 8 ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 16 కు ఆరుగురే ఉన్నారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 37 మంజూరు కాగా.. 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీన్ని బట్టి ఇన్నేళ్లు అకడమిక్, పరిశోధనలు, బోధనను ఎంత నిర్లక్ష్యంగా వహించారో అర్ధం చేసుకోవచ్చు.

యూనివర్సిటీ ప్రారంభంలో పెట్టిన కోర్సులే.. 

యూనివర్సిటీలో పదేళ్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టలేదు. యూనివర్సిటీ అనుబంధంగా ఇంజినీరింగ్, బీఈడీ, ఎంఈడీ, లా కాలేజీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ యూనివర్సిటీని ప్రారంభించిన సమయంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం దీనికి 200 ఎకరాలతోపాటు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సుల ప్రాతిపదికన పోస్టులను మంజూరు చేసింది. 

ఆ తర్వాత వీసీలుగా వచ్చిన  ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అలీ, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీరారెడ్డి కొత్త కోర్సులకు ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత శాతవాహన యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే.. అందుకు విరుద్ధంగా జరిగింది. ఇప్పటికైనా ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అప్పట్లో కీలకంగా పనిచేసిన ఇప్పటి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. 

న్యాక్ కు వెళ్లలేదు.. కాన్వొకేషన్ నిర్వహించలేదు

దేశంలోని ప్రతి యూనివర్సిటీ, అటానమస్ కాలేజీ న్యాక్ గుర్తింపు పొందడాన్ని యూజీసీ తప్పనిసరి చేసింది. న్యాక్ గుర్తింపు పొందితేనే యూనివర్సిటీకి యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ తదితర పరిశోధన సంస్థల నుంచి గ్రాంట్స్, ప్రాజెక్టులు మంజూరవుతాయి. కానీ శాతవాహన యూనివర్సిటీ ఇప్పటివరకు న్యాక్ గుర్తింపు పొందలేదు. యూనివర్సిటీలో భారీగా ఖాళీలు ఉండడంతోపాటు ఇప్పటివరకు న్యాక్ అక్రిడిటేషన్ కోసం అప్లికేషనే పెట్టలేదు. యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా 2019లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వీసీ చిరంజీవులు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ హయాంలో కాన్వొకేషన్ నిర్వహించి పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాతి ఐదేళ్లలో ఒక్కసారి కూడా కాన్వొకేషన్ నిర్వహించలేదు.