ఎస్‌‌‌‌‌‌‌‌యూ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జాస్తి రవికుమార్​

కరీంనగర్, వెలుగు : శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రొఫెసర్ జాస్తి రవి కుమార్ నియమితులయ్యారు. రవికుమార్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసర్ గా, ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన పుస్తకాలు రాయడంతోపాటు నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో జర్నల్స్‌‌‌‌‌‌‌‌ పబ్లిష్ చేశారు.

గతంలో ఆయన సికింద్రాబాద్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌గా, యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్ ఆఫీస్ డెరైక్టర్ గా, ఆచార్య ఘంటా రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ జాయింట్ డెరైక్టర్ గా, ఎగ్జామినేషన్ బ్రాంచ్ అడిషనల్ కంట్రోలర్ గా, ఓయూ శతాబ్ది ఉత్సవాల కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. శనివారం ఆయన ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.