దేవిశ్రీ, మైత్రి మేకర్స్ గొడవ: ఫైనల్గా క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత రవిశంకర్

ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మైత్రి ప్రొడ్యూసర్స్ పై అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే.  దాంతో ఈ దేవిశ్రీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక ప్రస్తుతం దేవిశ్రీ మైత్రి బ్యానర్ లో చేస్తున్న సినిమాలు నుంచి తప్పిస్తారని.. వీరి మధ్య సఖ్యత పూర్తిగా చెడిందని.. ఇలా రకరకాల రూమర్స్ వ్యాపించాయి. 

ఈ నేపథ్యంలో రాబిన్ హుడ్’ ప్రెస్ మీట్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మైత్రి మేకర్స్లో ఒకరైన రవిశంకర్ సమాధానమిచ్చారు. "దేవిశ్రీ ప్రసాద్ అన్నదాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. మైత్రిలో ప్రేమతో పాటు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి.. అని మాత్రమే అన్నారు. ఇక అందులో వేరే ఉద్దేశం లేదని.. మా కాంబినేషన్ భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగుతుంది..అందులో ఎటువంటి సందేహం లేదని" రవిశంకర్ స్పష్టం చేశారు.

Also Read : పుష్ప 2 కోసం ఎన్టీఆర్ లాగే అల్లు అర్జున్ కూడా ఆ పని చెయ్యబోతున్నాడు.. ఎందుకంటే.?

ప్రస్తుతం దేవిశ్రీ చేతిలో ఓ అరడజను పైగా సినిమాలున్నాయి. అందులో మైత్రి బ్యానర్లోనే ఎక్కువ ఉన్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ , పుష్ప2, రామ్ చరణ్ సుకుమార్ (RC 17), అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తున్నారు. ఇకపోతే వీరి బ్యానర్లో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ చాట్స్ ఇచ్చాడు. 

ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ఏం మాట్లాడంటే..?

'మనకి రావాల్సింది కచ్చితంగా అడిగి తీసుకోవాలి అది డబ్బు అయిన, క్రెడిట్ అయిన'. ఇలా మాట్లాడుతూనే.."స్టేజ్ ఎక్కి ఎక్కువ సేపు మాట్లాడలేదు..  టైంకి పాట ఇవ్వలేదు. టైమ్కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. టైమ్ కి ప్రోగ్రామ్ రాలేదు అని ఎక్కువ కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి.

అదేంటో అర్ధం కాదు.. ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపు 20-25 నిమిషాలు అవుతుంది.. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి అని నన్ను ఆపారు. నాకు అసలే సిగ్గు.. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రమే సిగ్గు లేకుండా ఉంటాను,స్టేజ్ కింద ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ సిగ్గుపడేది నేనే.

నేను ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్న. వాళ్ళు నన్ను వదలడం లేదు. కిస్సిక్ సాంగ్ లాంచ్ అవుతుండగా వచ్చాను. మీరొచ్చి నాతో రాంగ్ టైమింగ్ సర్ అని అంటున్నారు. నేనేం చేయగలను సర్. ఇవన్నీ సపరేట్గా కలిసినపుడు అడిగితే పెద్ద కిక్ ఉండదు.. ఇలా అడిగేయాలి" అంటూ దేవిశ్రీ స్టేజ్ పైన మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ మారాయి.