కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..

నిత్య జీవితంలో చాలామంది కష్టాలు.. సుఖాలు  అనుభవిస్తుంటారు.  సుఖం వచ్చినప్పుడు పొంగిపోతారు.. కష్టాలు వచ్చినప్పుడు నానా ఇబ్బందులు పడతారు.  కర్మాను సారంగా కష్ట సుఖాలు తప్పవని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అయితే దక్షిణామూర్తి పటాన్ని ఇంటిలో ఉంచుకుని ప్రతి రోజు  .. దక్షిణామూర్తి స్త్రోత్రం అని పఠిస్తూ కష్టాలు తీరుతాయని.. వాటి ప్రభావం తగ్గుతుందని పురాణాలు ద్వారా తెలుస్తుంది.  

మానవజన్మ.. అన్ని జన్మలకంటే చాలా ఉత్తమమైనది.  ఏది మంచో.. ఏది చెడో... మానవులు మాత్రమే తెలుసుకోగలరు.  మానవ జన్మ మాత్రమే   జ్ఞాన సంపాదనకు, మోక్షసాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు కూడా అంగీకరించారు. అటువంటి మానవుల దు:ఖాలను తొలగించి.. కష్టాల ప్రభావాన్ని తగ్గించే ఏకైక దైవం గురు దక్షిణామూర్తి  అని ఆధ్యాత్మికవేత్తలు పలు వేదికల్లో చెప్పారు. అందుకే ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి పటం ఉండాలి.  ప్రతిరోజు ఆయన స్తోత్రాన్ని  ఎవరు 10 నిమిషాల పాటు పఠిస్తూ ఉంటారో .. అలాంటి వారు తెలిసీ.. తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.  దక్షిణామూర్తిని ఆరాధించిన వారిని .. కష్టాలనుంచి ఆయన రక్షిస్తాడని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు.  సీతాదేవి లంకలో ఉన్న సమయంలో అక్కడ భూమిపై దక్షిణామూర్తిని ఆవాహన చేసి నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం  పఠించడం మొదలు పెట్టిన తరువాతే.. హనుమంతుడు లంకకు బయలు దేరాడని పురాణాలు చెబుతున్నాయి. 

దక్షిణా మూర్తి శివశక్తుల సమైక్య రూపం.... దక్షిణామూర్తి స్వరూపాన్ని.. విగ్రహాన్ని పరిశీలిస్తే.. ఆ స్వామి ఎడమ చెవికి తాటంకం... కుడి చెవికి మకర కుండలం అలంకారాలుగా  ఉంటాయి.  తాటకం  స్త్రీల అలంకృతి కాగా.. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం.  ఈ రెండు సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.  దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ అని వివరిస్తోంది.

హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు. జ్ఞాన ముద్ర ఈ విధంగా వివరించబడింది. బొటనవేలు భగవంతుడిని, చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది. మిగిలిన మూడు వేళ్లు మనిషి మూడు పుట్టుకతో వచ్చే మలినాలను సూచిస్తాయి. గత జన్మల అహంకారం, భ్రమ, చెడు పనులు. వారంలోని ఐదవ రోజు, గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అనేక శైవక్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 

ALSO READ : ధనుర్మాసం: తిరుప్పావై 13 వ రోజు పాశురం..గోకులంలో రామగానం చేసిన గోపికలు..

దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం, గురువు. ఈ రూపం శివుడిని యోగా, సంగీతం, జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది.  హిందూ గ్రంధాల ప్రకారం, ఒక వ్యక్తికి గురువు లేకుంటే, వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. చివరికి వారు యోగ్యులైతే, స్వీయ-సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వాదం పొందుతారు.ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి. బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనక సనందనాదులు సదా శివుని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో శివుడు గౌరి సమేతుడై దేవ గణాల మధ్యన నాట్యం చేస్తు న్నాడు. ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు. అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది. శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. మహా విష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం.

వసిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు.  ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో దానినే దాక్షిణ్యం’ అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. 


జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశలో శివుడు సాధారణంగా నాలుగు చేతులతో కనిపిస్తాడు. అతను ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లు కనిపిస్తాడు. శివుడు జింక సింహాసనంపై కూర్చున్నాడు. అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు కనిపిస్తారు. అతను పౌరాణిక అపస్మర (హిందూ పురాణాల ప్రకారం, అజ్ఞానం స్వరూపం అయిన ఒక రాక్షసుడు)పై తన కుడి పాదంతో కూర్చున్నట్లు కనిపిస్తారు. అతని ఎడమ పాదం అతని ఒడిలో ముడుచుకుని ఉంటుంది. కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుడిని చుట్టుముట్టినట్లు చిత్రణ ఉంటుంది. భారతీయ సంప్రదాయం గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది. దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా – బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా ఈ తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

దక్షిణామూర్తి మంత్రం

ఓం వృషభ-ధ్వజాయ విద్మహే,
ఘృణి హస్తాఆ ధీమహి తన్నో,
దక్షిణామూర్తి ప్రచోదయాత్
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకామూర్తయే !
నిర్మాలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః !!
చిద్దనాయ మహేశాయ వటమూలనివాసినే !
ఓంకారవాచ్యరూపాయ దక్షిణామూర్తయే నమః !!
గురవే సర్వలోకానాం భిషజే భవరోగినమ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్!
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ: