పెన్షన్ కోసం ఎదురుచూపులు

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గగ్గుపల్లి గ్రామానికి చెందిన సంగం నర్సు బాయ్  పుట్టినప్పటి నుంచి  ఒక కన్ను కనిపించదు.  దానికి తోడు యాక్సిడెంట్ కావడం ఇబ్బందిపడుతున్నట్లు తెలిపింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి  పలుమార్లు అప్లికేషన్లు పెట్టినా తమకు పెన్షన్ రావడంలేదని వాపోయింది. తనకు సదరం సర్టిఫికెట్ ఇవ్వడంలేదని

ఇందు కోసం హైదరాబాద్​ వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తెలిపింది. సోమవారం భర్త పెద్ద గంగారం తో కలసి కలెక్టర్ కార్యాలయంలో మరో మారు దరఖాస్తు చేసేందుకు వచ్చింది.  అధికారులు స్పందించి  వీలైనంత త్వరగా తమకు పెన్షన్ వచ్చేలా చూడాలని ఈ వృద్ధ దంపతులు వేడుకున్నారు.