కబడ్డీ కూత.. ఫ్యాన్స్‌‌ విజిల్స్ మోత

హైదరాబాద్‌‌లో ప్రొ కబడ్డీ లీగ్ కూత షురూ అయింది. మెగా లీగ్ 11వ సీజన్‌‌  గచ్చి బౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం సందడిగా మొదలైంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌‌లు హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్‌‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌‌ జట్టు.. బెంగళూరు బుల్స్‌‌ను ఓడించగా.. రెండో మ్యాచ్‌‌లో యు ముంబాపై దబాంగ్ ఢిల్లీ  గెలిచింది. రెండు మ్యాచ్​లకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

 తెలుగు టైటాన్స్‌‌ జట్టుతోపాటు అభిమాన ఆటగాళ్లను ప్రోత్సహించారు. బాలీవుడ్‌‌ నటులు కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ స్టేడియంలో సందడి చేశారు. ఇద్దరూ కబడ్డీ ఆడుతున్నట్లు పోజులిచ్చారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి మ్యాచ్‌‌ను వీక్షించారు. – హైదరాబాద్, వెలుగు