Diwali 2024 : సారె తిరుగుతోంది కానీ.. లక్ష్మీ కటాక్షం లేదు.. ప్రమిదల  తయారీదారుల జీవితాలు ఇలా..!

దీపావళి రోజున లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ దీపాలు వెలిగిస్తారు. కానీ వాటిని తయారుచేసేవాళ్లకు మాత్రం లక్ష్మీదేవి కటాక్షం ఉండటం లేదు. ఏడాదంతా కష్టపడ్డా సరైన ప్రతిఫలం దక్కడం లేదు. సారెతిప్పే చేతులు నొప్పెడుతున్నాయే తప్ప, వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండటం లేదు. అయినా కులవృత్తినే నమ్ముకున్న దీపావళి పండుగకు ప్రమిదలు తయారు చేసే వారిపై వీ6, వెలుగు ప్రత్యేక కథనం. .  . 

మహబూబాబాద్​ మండలం  శనిగపురంలోని కుమ్మరివాడకు వెళ్తే కుమ్మరి చక్రం, మట్టిదీపాలు, ప్రమిదలు కనిపిస్తాయి. మగవాళ్లంతా దీపావళి ప్రమిదలు తయారుచేస్తుంటే. ఆడవాళ్లు మట్టి కలుపుతూ కనిపిస్తారు.  వీరంతా కుమ్మరి చక్రంపై ఆధారపడి పనిచేస్తున్నాయి. కుటుంబంలో చాలా మంది పొట్టకూటి కోసం వివిధ పనులు చేస్తున్నప్పటికీ, కుమ్మరి వృత్తిని మాత్రం వదల్లేదు.

 ఒకప్పుడు కుమ్మరులు తయారుచేసిన ప్రమిదలకు బాగా డిమాండ్ ఉండేది. కానీ విద్యుత్ దీపాల రాకతో వీళ్లకు పని తక్కువైంది. అలాగే మార్కెట్లోకి రకరకాల ప్రమిదలు రావడంతో లోకల్ గా తయారుచేసిన ప్రమిదల అమ్మకాలు తగ్గాయి. చిరువ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి ప్రమిదల్ని తెచ్చి అమ్ముతున్నారు. అయినా కులవృత్తిని మాత్రం వదలేదు. ఒకవైపు కూలీ పనులకు వెళ్తూనే.. మట్టి ప్రమిదలను తయారుచేస్తున్నారు.  కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకకపోయినా ... దైవంగా భావించే కులవృత్తిని మాత్రం వదలిపెట్టడం లేదు. . మట్టితో అనుబందం ఏళ్ల వాటిని తాతల కాలం నుంచి  రావడంతో ఇదే పనిని చేస్తున్నారు. 

Also Read:-దీపావళి ప్రమిదల్లో ఎన్ని ఒత్తులు ఉండాలి..

ప్రమీదల తయారీకి చెరువులపై ఆధారపడతారు వీళ్లంతా, మట్టిని తెచ్చి అరబెడతారు. మూడు రోజులు నానబెట్టి మట్టిని తొక్కుతారు. తర్వాత సారెపై మట్టిని ఉంచి దానిని తిప్పుతూ ప్రమిదలను తయారుచేస్తారు. గతంలో దీపావళి పండుగ సమయంలో కుమ్మరుల ఇళ్లకు వచ్చి ప్రమిదల కోసం ఆర్డరు ఇచ్చేవారు వ్యాపారులు కానీ ప్రస్తుతం ఎక్కడా ఇలాంటి ఆర్డర్లు కనిపించడం లేదు.  ప్రతి వస్తువుకు ఏటేటా రేట్లు పెరుగుతుంటే.. దీపావళి ప్రమిదలకు మాత్రం ధర తగ్గుతుందని  ప్రమిదల తయారీ దారులు వాపోతున్నారు.  

ఒకప్పుడు ప్రమీదలకు బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు. చాలా తగ్గింది. డిమాండ్ తగ్గినా మేం తయారుచేయడం మాత్రం మానలేదు. గతంలో దీపావళి పండుగ సమయంలో వారం రోజుల ముందే ఆర్డర్స్ ఇచ్చేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తయారుచేసిన వస్తువులు మార్కెట్ కు తరలించలేక మారు బేరానికి అమ్ముకుంటున్నారు.  చాలామంది ప్రమిదలు  దాచుకొని మళ్లీ వాటినే ఉపయోగిస్తున్నారు.  అలా కూడా కొత్తగా ప్రమిదలు కొనేవారు ఉండటం లేదని.. సిటీల్లో అక్కడడక్కడ ఒకరిద్దరు మాత్రం కొంటున్నారని.. కనీసం మట్టి ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన తయారు చేస్తున్నారు.. దీపం అంటే మహాలక్ష్మీ.. సంపద.. అయితే వీటిని కలుగజేసేందుకు ముఖ్యమైన ప్రమిదల తయారు చేసే వారి ఇళ్లు మాత్రం అలా లేకుండా వెలవెలబోతున్నాయి.

–వెలుగు,లైఫ్​–