ప్రియాంకగాంధీ.. వయనాడ్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు..తొలిప్రసంగంలోనే కేంద్ర ప్రభుత్వం విరుచుపడ్డారు..ప్రియాంక తొలి ప్రసంగం మొత్తం రాజ్యాంగం, రిజర్వేషన్లు, దేశ వ్యాప్తంగా కుల గణను చుట్టే తిరిగింది. భారత రాజ్యాంగం అంటే ఏందో ప్రధాని మోదీకి అర్థం కాదు..రాజ్యాంగం ఓ ఒప్పందం..సంఘ్ విధానం కాదు అని అన్నారు ప్రియాంకగాంధీ.
సంభాల్, మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై ప్రియాంకగాంధీ తప్పుబట్టారు. రాజ్యాంగం అంటే మోదీకి అర్థంకాలేదు.. రాజ్యాంగాన్ని మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) రూల్‌బుక్ అని అనుకుంటున్నారని ప్రియాంకగాంధీ అన్నారు.
రాజ్యాంగం ఆమోదించిన 75వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకున్న చర్చలో ..‘‘రాజ్యాంగం ఓ రక్షణ కవచం.. దానిని ఏన్డీయే ప్రభుత్వం విచ్చిన్నం చేసేందుకు ప్రయ త్నిస్తోందని అన్నారు.
ALSO READ | పార్లమెంట్ ఆవరణలో ఏడో రోజూ ప్రతిపక్షాల ఆందోళన
సభలో రాజ్యాం గంపై చర్చలో పాల్గొన్న వయనాడ్ ఎంపీ , రాజ్యాంగం న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేఛ్చకు రక్షణకవచమని అన్నారు..గత పదేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్కవం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
మరోవైపు గత లోక్ సభ ఎన్నికలపై ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అధిక సీట్లు వస్తే..రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రయ ప్రారంభించే వారని ప్రియాంక గాంధీ అన్నారు. భారత రాజ్యాంగం అర్థం కాదు, యూనియన్ రాజ్యాంగం అని అన్నారు.