యూట్యూబర్​: ప్రియా.. సిద్‌‌‌‌‌‌‌‌.. ఓ వ్యాన్‌‌‌‌

ఓ వ్యాన్‌‌‌‌ని ఇంటిలా మార్చుకుని రెక్కలొచ్చిన పక్షుల్లా దేశ విదేశాలు తిరుగుతోంది ఓ జంట. వాళ్ల ప్రయాణాన్ని అందరితో పంచుకోవాలని వీడియోలు తీసి టిక్‌‌‌‌టాక్‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌ లాంటి సోషల్‌‌‌‌ మీడియా ఫ్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.  వాళ్ల ప్రయాణం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఇప్పుడు ఇండియాలోని ఎవరెస్ట్‌‌‌‌ వరకు చేరింది. 

టిక్‌‌‌‌టాక్‌‌‌‌లో బాగా ఫాలోయింగ్‌‌‌‌ ఉన్న సెలబ్రిటీ ప్రియా శర్మ. యూట్యూబ్‌‌‌‌లో కూడా ఆమెకు చాలా ఫాలోయింగ్‌‌‌‌ ఉంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పుట్టి, పెరిగిన భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రియ. ఆమె తల్లిదండ్రులు1992లో ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి, అక్కడే సెటిల్‌‌‌‌ అయ్యారు. పెండ్లయ్యాక భర్త సిధ్‌‌‌‌తోపాటు ఎక్స్‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌గా ఆస్ట్రేలియాలోనే పనిచేసింది.

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో నిర్ణయం 

ప్రియా, సిధ్‌‌‌‌లు ఉద్యోగం చేస్తూ హాయిగా గడుపుతున్న రోజుల్లో కరోనా వచ్చింది. లాక్‌‌‌‌డౌన్ టైంలో ఖాళీగా ఉండలేక ఎక్కడికైనా ట్రిప్‌‌‌‌కి వెళ్లాలి అనుకున్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ ఆంక్షలు ఎత్తివేయగానే ఆఫ్రికాలోని తీర ప్రాంతాల్లో ట్రావెలింగ్‌‌‌‌ మొదలుపెట్టారు. ఆ టైంలోనే వాళ్లు చాలాచోట్ల వ్యాన్‌‌‌‌ ట్రావెలర్స్‌‌‌‌ని చూశారు. వ్యాన్‌‌‌‌నే ఇంటిలా మార్చుకుని, అందులోనే హాయిగా వంట చేసుకుంటూ, రెస్ట్‌‌‌‌ తీసుకుంటూ ట్రావెల్‌‌‌‌ చేయడమనే కాన్సెప్ట్​ వాళ్లకు బాగా నచ్చింది.

అంతే వెంటనే ఇద్దరూ కలసి ఆలోచించి, కొన్నాళ్లు వ్యాన్‌‌‌‌ ట్రావెల్ చేయాలని డిసైడ్‌‌‌‌ అయ్యారు. అప్పటికే వాళ్లు ఐదేండ్లు ఉద్యోగాలు చేశారు. అప్పుడు దాచుకున్న కొంత డబ్బు చేతిలో ఉంది. ఇంకేముంది ట్రావెలింగ్ మొదలుపెట్టాలి అనిడిసైడ్​ అయిపోయారు. వెంటనే చేస్తున్న ఉద్యోగాలకి రిజైన్‌‌‌‌ చేశారు. వ్యాన్‌‌‌‌ లైఫ్‌‌‌‌కి ‘వెల్‌‌‌‌కం’ చెప్పారు. ఓ వ్యాన్‌‌‌‌ కొని వాళ్లకు తగినట్టు మార్పులు చేయించుకుని ప్రయాణం మొదలుపెట్టారు. ముందుగా హోరిజోన్‌‌‌‌ అనే ప్రాంతానికి వెళ్లారు. 

డాక్యుమెంట్‌‌‌‌ చేస్తే..

ట్రావెలింగ్‌‌‌‌తోపాటు వాళ్ల జర్నీని డాక్యుమెంట్‌‌‌‌ చేయాలి అనుకుంది ప్రియ. ప్రతి రోజూ చేసే పనులను, సాహసాలను డాక్యుమెంట్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఆ కంటెంట్‌‌‌‌ని టిక్‌‌‌‌టాక్‌‌‌‌లో పంచుకుంది. కానీ.. టిక్‌‌‌‌టాక్‌‌‌‌లో రీచ్‌‌‌‌ వచ్చి, తాను ఫేమస్‌‌‌‌ అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. వీడియోలు షేర్‌‌‌‌‌‌‌‌ చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. వాస్తవానికి ఆమె ఓ పది వేల మంది ఫాలోవర్స్ వస్తే గొప్ప అనుకుంది. కానీ.. ఒక్కసారిగా లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్ వచ్చేసరికి ఆశ్చర్యపోయింది. ఇప్పుడామెకు రెండు మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. 

దేశీ వంటలు 

ట్రావెల్ డైరీలతో పాటు తన ఫాలోవర్స్‌‌‌‌కి ఇండియన్ వంటకాలు చేయడం కూడా నేర్పుతోంది ప్రియ. ముఖ్యంగా స్వీట్స్​‌‌‌‌, మసాలా వంటలతోపాటు అన్ని రకాల శాఖాహార వంటలు చేస్తుంటుంది. వాటిలో ఇండియన్‌‌‌‌ వంటకాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం టిఫిన్‌‌‌‌, రాత్రి భోజనం కచ్చితంగా ఇండియన్‌‌‌‌ స్టయిల్‌‌‌‌లో వండినవే తింటుంది. అంతేకాదు.. వాళ్ల నాన్న చేసిన ఒక స్పెషల్ స్పైస్ మిక్స్‌‌‌‌ని ఎప్పుడూ తనతోపాటే తీసుకెళ్తుంది.

వాస్తవానికి ఆ మిక్స్‌‌‌‌ వెనుక పెద్ద కథే ఉంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. అప్పుడామె గనుల్లో పని చేయడానికి రిమోట్ క్వీన్స్‌‌‌‌లాండ్‌‌‌‌కు వెళ్లింది. అప్పటికి ఆమెకు వండడం తెలియదు. అందుకే వాళ్ల నాన్న ఆమె కోసం ఫుడ్‌‌‌‌పై చల్లుకోవడానికి మసాలా మిక్స్‌‌‌‌ చేసి ఇచ్చాడు. ఆ స్పెషల్ మిక్స్‌‌‌‌ని ఆమె ఇప్పటికీ వాడుతోంది. అంతేకాదు... దాన్ని ‘డాడ్స్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ స్పైస్‌‌‌‌ మిక్స్‌‌‌‌’ బ్రాండింగ్‌‌‌‌తో మార్కెట్‌‌‌‌లో అమ్ముతోంది కూడా.  

దేశీ మాటలు 

పుట్టింది ఆస్ట్రేలియాలోనే అయినా.. ఇండియా అంటే ప్రియకు అభిమానం ఎక్కువ. అందుకే హిందీలో కూడా వ్లాగ్స్‌‌‌‌ చేస్తుంటుంది. వాస్తవానికి ఆమె మాట్లాడేది ఆస్ట్రేలియన్‌‌‌‌ యాక్సెంట్​. అయినా.. హిందీ చక్కగా మాట్లాడుతుంది. కొన్నింటిని హిందీలో ఏమని పిలవాలో కూడా తెలియదు. అయినా.. మాట్లాడడానికి ట్రై చేస్తుంటుంది. ‘‘నమస్తే, మేరా నామ్ ప్రియా హై. ఔర్ హమ్ దోనో వ్యాన్‌‌‌‌ మే రెహతే హై ...” అంటూ వ్లాగ్ మొదలుపెడుతుంది. కొన్ని హిందీ పదాలను పలికేందుకు ఆమె చేసే ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటుంటారు. 

యూట్యూబ్‌‌‌‌లోకి.. 

ప్రియా అండ్‌‌‌‌ సిధ్‌‌‌‌ పేరుతో 2021లో యూట్యూబ్ ఛానెల్‌‌‌‌ మొదలుపెట్టింది. ఇప్పటివరకు చిన్నా, పెద్ద కలిపి మొత్తం 272 వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసింది. ప్రస్తుతం ఆమె ఛానెల్‌‌‌‌కు 2.15 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. అయితే.. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు సబ్‌‌‌‌స్క్రయిబర్స్ తక్కువే అయినా ఆమె పోస్ట్​ చేసే షార్ట్ వీడియోలకు వ్యూస్ బాగా వస్తాయి. ఒక వీడియోకు అయితే.. ఏకంగా106 మిలియన్ల వ్యూస్‌‌‌‌ వచ్చాయి!