ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్ దందా

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎంలో ప్రైవేట్ ల్యాబ్​దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. గురువారం ఓ ప్రైవేటు ల్యాబ్​కు చెందిన ఓ వ్యక్తి ఎంజీఎంలోని అత్యవసర విభాగానికి చేరుకొని రోగి నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు ఆసుపత్రిలోనికి అనుమతించినందుకుగాను సెక్యూరిటీ, వార్డు బాయిలు, ఇతర సిబ్బందికి కమిషన్లు ముట్ట చెబుతున్నారనే ఆరోపణలున్నాయి.