పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తికి మోదీ అభినందనలు

  • ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన  ప్రధాని

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల జరిగిన పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’ వేదికగా విషెస్ తెలిపారు. దీప్తి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.

ఆమె నైపుణ్యాలు, పట్టుదల ప్రశంసనీయమని కితాబిచ్చారు. దీప్తి తెలంగాణలోని వరంగల్ కు చెందిన వారు. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించారు.