ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. వేలల్లో తగ్గిన ఆపిల్ ఐఫోన్ .. మిస్ కాకండి


ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.  మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే అమెజాన్ ఇండియా 5G సూపర్‌స్టోర్ అద్భుతమైన డీల్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. iPhone 15తో పాటు iPhone 14, 14 Plus ఫోన్లపై బంపర్ తగ్గింపులను అందిస్తోంది.మీరు మంచి బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. వీటిపై క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఐఫోన్ల ధరను మరింత తగ్గించవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఐఫోన్లపై అందిస్తున్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

 I Phone 14 ఫోన్​..128 GB మిడ్‌నైట్ కలర్ వేరియంట్ 62,800 రూపాయలకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ ద్వారా ఈ ఫోన్ ధరను రూ. 3,000 తగ్గించవచ్చు. ఫోన్‌పై రూ.3140 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 44,250 వరకు బెనిఫిట్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ని ఈజీ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయంలో కంపెనీ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను ఇచ్చింది. కంపెనీ ఫోన్‌లో A15 బయోనిక్ చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌గా అందిస్తోంది.

 I Phone 14 + ఫోన్.. 128 GB స్టార్‌లైట్ కలర్ వేరియంట్ రూ. 62,999కి అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్‌లో రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌పై రూ. 3150 క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఫోన్ ధరను రూ.44,250 తగ్గించవచ్చు. ఈ ఐఫోన్‌లో మీకు 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే లభిస్తుంది. ఫోన్ కెమెరా సెటప్ అమెజింగ్‌గా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ పర్ఫామెన్స్ కూడా బెటర్‌గా ఉంటుంది. ఇది 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ని ఇస్తుంది.

  I Phone 15... ఈ ఫోన్ 128 GB పింక్ వేరియంట్ అమెజాన్ 5G సూపర్‌స్టోర్‌లో రూ. 71,499కి అందుబాటులో ఉంది. దీనిపై రూ.4 వేల బ్యాంక్ ఆఫర్ ఉంది. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 3575 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ సేల్‌లో కూడా ఈ ఐఫోన్‌పై రూ.44,250 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్స్, ఇది 2x టెలిఫోటోతో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ఫోన్ A16 బయోనిక్ చిప్‌సెట్‌‌పై రన్ అవుతుంది.