గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలే

  • నాకు దక్కిన పదవి ఉద్యమకారులకు ఇచ్చినట్లుగానే భావిస్తా
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం
  • ఎమ్మెల్సీ కోదండరాం

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, సామాన్యుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కోదండరాం చెప్పారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన ‘పౌర సమాజంతో మాటముచ్చట’ కార్యక్రమానికి కోదండరాంతో పాటు, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వొడితెల ప్రణవ్‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రజలంతా ఏకమై పోరాటం చేశారని గుర్తు చేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే నిర్బంధాలకు గురి చేశారని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనే పరాయివాళ్లమైపోయిన పరిస్థితి ఉండడంతో తనతో పాటు చాలా మంది ఉద్యమకారులు మనోవేదనకు గురయ్యారన్నారు.

 గత పదేండ్లలో తెలంగాణలో అభివృద్ధి కంటే అప్పులే ఎక్కువ అయ్యాయని, ప్రస్తుతం ప్రతి నెల అప్పులు కట్టేందుకే ఇబ్బందిగా ఉందన్నారు. విద్య, వైద్య రంగంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందన్నారు. వాటిని దారిలో పెట్టేందుకు త్వరలోనే రివ్యూ నిర్వహిస్తామన్నారు. కాళేశ్వరం నుంచి కనీసం 50 వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదని, దానిని కట్టేందుకు మాత్రం రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఎమర్జెన్సీ ఏర్పడిందని వాటి పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ జన సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ముక్కెర రాజు, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, పలకల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, స్వరాజ్యం, నేర్నాల కిశోర్‌‌‌‌‌‌‌‌, పాక సతీష్, వేల్పుల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో ఉద్యమకారులకు అన్యాయం

హనుమకొండ సిటీ, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లోని నేరెళ్ల వేణుమాధవ్‌‌‌‌‌‌‌‌ కళా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల గర్జన సభలో ఆయన మాట్లాడారు. ఏ ఒక్కరో ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 

ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ఉద్యమకారులు కొండ్ర నర్సింగరావు, దేవులపల్లి రాఘవేందర్, గద్దర్‌‌‌‌‌‌‌‌ సాంబయ్య, జిలుకర్ర శ్రీనివాస్, జైసింగ్‌‌‌‌‌‌‌‌ రాథోడ్, సాయిని నరేందర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.