కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. కోల్కతాడాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై ద్రౌపది ముర్ము తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దాడి అత్యంత క్రూరమైన దాడి.. భయభ్రాంతులకు గురిచే సిం ది..అసహ్యకరమైన ఈ సామూహిక అఘాయిత్యం అంటూ తీవ్రంగా ఖండించింది. ఇకచాలు..ఇలాం టి ఆకృత్యాలను ఏ నాగరిక సమాజం సహించదని రాష్ట్రపతి బుధవారం (ఆగస్టు28) విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
2012లో ఢిల్లీ నిర్భయ కేసు మరువక ముందే..దేశంలో లేక్కలేనన్ని అత్యాచార ఘటనలు.. ఢిల్లీలో నిర్భయ మాదిరిగానే కోలకతా లో మరో అత్యంత దారుణమైన, హేయమైన చర్య మరోసారి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కుమార్తెలు, సోదరీమణులు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదన్నారు.
మరోవైపు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర చిన్నారులపై అత్యాచారం, మలయాళ చిత్ర పరిశ్రమలోని నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సహా మహిళలపై హింసాత్మక నేరాలకు సంబంధించిన ఇటీవల జరిగిన భయంకరమైన సంఘటనలకు సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లాగ్ చేశారు.