రెడ్​ క్రాస్​ సొసైటీ  సేవలు భేష్​

బోధన్​, వెలుగు: ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీ బోధన్​ డివిజన్​ సేవలు అభినందనీయమని సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు అన్నారు. బుధవారం బోధన్​ డివిజన్​ ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీ సమవేశం  లయన్స్​ క్లబ్​ ఆఫ్ ​బోధన్​ఆఫీస్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇండియన్​ రెడ్ క్రాస్​ సొసైటీ పరిధిలో 2,569 యునిట్ల రక్తం సేకరించామన్నారు.

1,004 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం, మందులు అందజేశామని తెలిపారు. అనంతరం రెడ్​ క్రాస్ సొసైటీ సభ్యులు బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతోను కలసి సొసైటీ సేవలు వివరించారు.  కార్యక్రమంలో  ఏసీపీ పి.శ్రీనివాస్, తహసీల్దార్​విఠల్, సొసైటీ బోధన్​ డివిజన్​ అధ్యక్షుడు బసవేశ్వరరావు, జిల్లా కోశాధికారి కరిపె రవీందర్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్​మెంబర్లు తోట రాజశేఖర, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.