Good Idea: మీకు తెలివైన పిల్లలు పుట్టాలా.. ఆ సమయంలో ఎలాంటి ఫుడ్ తినాలంటే..

తమ పిల్లలు తెలివైన వాళ్లుగా పుట్టాలని, ఫస్ట్ ర్యాంక్ తో  మొదలై.. పెద్ద ఉద్యోగం సంపాదించాలని చాలామంది పేరెంట్స్ కలలు కంటారు. మరి వాళ్ల తెలివి తేటల్ని ఎలా పెంచాలి? చదువుకుంటే తెలివి పెరుగుతుందా? లేక తెలివి ఉంటేనే చదువు బాగా వస్తుందా?  ఈ విషయంలో యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ' ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. . .

 ప్రెగ్నెంట్ అయిన మొదటి మూడు నెలల్లో జీడిపప్పు, బాదాం. పిస్తా వంటి డ్రైనట్స్ తిన్నవాళ్లకు పుట్టిన పిల్లల్లో ఐక్యూ లెవల్స్, కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉందని   యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ పరిశోధకులు చేసిన స్టడీలో తేలిందట...  ప్రెగ్నెంట్ అయిన మొదటి మూడు నెలలూ డ్రై నట్స్ తిన్న వాళ్లలో జ్ఞాపకశక్తి ఎన్నో రెట్లు ఎక్కువ ఉందని వాళ్లు కనుక్కొన్నారు. డ్రై నట్స్ లో  ఫోలిక్ యాసిడ్, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడులోని ప్రాంటల్ క్యార్టెల్ని యాక్టివేట్ చేసి జ్ఞాపక శక్తిని పెంచుతాయట..! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రెగ్నెంట్ అయితే ఈ డైట్ ఫాలో అవ్వండి. . 

-వెలుగు,లైఫ్-